https://oktelugu.com/

Chanakya Niti : చాణక్య నీతి: కుటుంబానికి హాని కలిగించే ఈ లక్షణాలు ఉన్న వారితో జాగ్రత్త…

Chanakya Niti : కుటుంబ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరికి పెళ్లి కాకముందు ఒక జీవితం ఉంటే.. పెళ్లయిన తర్వాత మరో జీవితం సాగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ బాధ్యతతో వెలగాల్సి ఉంటుంది.

Written By: , Updated On : March 23, 2025 / 03:00 AM IST
Chanakya Niti

Chanakya Niti

Follow us on

Chanakya Niti : కుటుంబ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరికి పెళ్లి కాకముందు ఒక జీవితం ఉంటే.. పెళ్లయిన తర్వాత మరో జీవితం సాగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ బాధ్యతతో వెలగాల్సి ఉంటుంది. భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంతోషాలు దుఃఖాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే సంసారం విజయవంతంగా సాగాలంటే భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరాలి. ఇద్దరూ ఒకే మాటపై నిలబడితే కుటుంబంలో ఎలాంటి చికాకులు లేకుండా సాగుతుంది. అలాకాకుండా ఇగో ప్రాబ్లం తో ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించాలని చూస్తే ఆ సంసారం నిర్వీర్యం అయిపోతుంది. అయితే కొన్ని కుటుంబాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి లక్షణాలు ఉన్నవారు కుటుంబానికి హాని చేసిన వారవుతారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది. ఇంతకీ ఆ లక్షణాలు ఏవంటే?

భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని అంటారు. కానీ కొందరు ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్దాలు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏర్పడి ఒకరిపై ఒకరికి వ్యతిరేక భావన ఏర్పడుతుంది. దీంతో చెడు ప్రభావం కలిగి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా ఈ ప్రభావం కుటుంబం పై పడి చిన్నాభిన్నమవుతుంది. అందువల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధాలు చెబుతున్నారని అర్థమైతే వారిని సక్రమ మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. లేదా వారికి దూరంగా ఉండాలి.

Also Read : చాణక్య నీతి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పనులకు దూరంగా ఉండాలి..

మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు పెద్దలు. సమాజంలో పెద్దలను గౌరవించడం వల్ల వారి మన్ననలను పొందుతూ ఉంటారు. కానీ కొందరికి పెద్దలంటే గౌరవం ఉండదు. వారిని గౌరవించకుండా వారు చెప్పినది వినకుండా ఉంటారు. ఇలాంటి లక్షణం కలిగి ఉన్నవారు కుటుంబానికి హాని చేసిన వారవుతారు. దంపతుల్లో ఇద్దరూ గౌరవ మర్యాదలతో ఉంటే వారి పిల్లలు కూడా సక్రమ మార్గంలో ఉంటారు.

ప్రతి చిన్న విషయానికి కోపంగా ఉండే వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరితో ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అయితే తమ కోపం గురించి ఎదుటివారి చెప్పగలగాలి. అలా వినకపోతే ఇతరులతో చెప్పించాలి. అయినా వినకపోతే వారికి దూరంగా లేదా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇలా నిత్యం కోపం తెచ్చుకునేవారు ఎదుటివారి మాట వినకుండా తమ కుటుంబానికి హాని తీసుకొస్తారు.

ఆశ జీవితాన్ని నిలబెడితే.. అత్యాశ జీవితాన్ని నాశనం చేస్తుందని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల అత్యాశ కలిగిన వ్యక్తులు కుటుంబానికి చేటు అని చాణక్య నీతి తెలుపుతుంది. ఏదైనా అవసరం మేరకు తీసుకొని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అత్యాశ కోరుకునేవారు అనవసరమైన తప్పులు చేస్తారు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల అత్యాశను కోరుకునే వారు ఎవరైనా జీవితంలో ఇబ్బందులు పడాల్సిందే.

ఇలాంటి లక్షణాలు భార్యాభర్తల్లో ఎవరికి ఉన్న కుటుంబానికి హాని కలుగుతుంది. అందువల్ల ఈ లక్షణాలను ఎదుటివారు గుర్తిస్తే వెంటనే వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా చేయాలి.

Also Read : చాణక్య నీతి: ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపొండి.. లేకుంటే నష్టమే?