Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై ఎన్నో పరిష్కారాలు సూచించాడు. మన రహస్యాలు ఎవరితోనూ పంచుకోకూడదు. దీంతో మనకు ఇబ్బందులు వస్తాయి. చాణక్యుడు ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో భోజనం చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. అలా చేస్తే మన ఆకలి తీరదు. కడుపు ఖాళీగా ఉంటే ఏదీ మనసున పట్టదు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఆకలిని ఎప్పుడు దాచుకోకూడదు.
సిగ్గు పడితే కష్టమే
విద్యార్థి విద్య నేర్చుకునేందుకు సిగ్గుపడకూడదు. తన గురువుల దగ్గర సిగ్గు పడితే కుదరదు. విద్యలో తెలివితేటలు సంపాదించుకునే వాడు ఏదైనా నేర్చుకోవాలంటే సిగ్గు పడితే కష్టమే. మనకు నేర్చుకునే అవకాశం ఉండదు. మొహమాటం అవసరం లేదు. విద్య నేర్చుకునేటప్పుడు సిగ్గు పడితే మనకు నష్టం. నేర్చుకునే విషయం గురువును అడిగి మరీ నేర్చుకోవాలి.
క్రమశిక్షణ
విద్యార్థికి క్రమశిక్షణ ఆభరణం లాంటిది. మనకు ఎంత క్రమశిక్షణ ఉంటే అంత ఎదుగుతాం. సమయ పాలన లేని వాడు ఎందులో రాణించలేడు. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో రాణించలేడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇతరుల కంటే ముందు చూపుతో ఉంటాడు. అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి చేరుతుంది. ఈ క్రమంలో క్రమశిక్షణతో ఉంటేనే ఏదైనా సాధ్యమే.
అప్పు అడగడానికి..
కొందరు ఇచ్చిన అప్పు అడగడానికి కూడా సిగ్గు పడతారు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కావడంతో అడిగేందుకు సిగ్గెందుకు. మనం దొంగతనం చేసి సంపాదిస్తే భయపడాలి. చాణక్యుడి ప్రకారం ఇచ్చిన అప్పు తిరిగి తీసుకునేందుకు శ్రద్ధ తీసుకోవాలి. అప్పు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఇలా చాణక్యుడు అప్పు అడిగే సమయంలో అసలు సిగ్గు పడకూడదు.