Chanakya Niti: చాణక్య నీతులు నిత్యం ఎవరో ఒకరు చెబుతుంటారు. లేదా ఎక్కడైనా చదువుతుంటాం. ఈయన చెప్పే ఎన్నో మంచి మాటలను నేటికి చాలా మంది పాటిస్తుంటారు. ఆ గొప్ప వ్యక్తి మంచి తనం గురించి, పాటించాల్సిన విధి విధానాల గురించి ఎన్నో నీతులు చెప్పారు. పెళ్లిళ్ల గురించి, భార్య భర్తలు ఎలా ఉండాలి? ఎలా కష్టపడాలి ఇలా ఆయన చెప్పిన మంచి మాటలు, నీతులు ఎన్నో ఉన్నాయి. వాటిని పాటించిన ఎందరో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతుంటారు కూడా. అయితే వివాహ బంధంలో ప్రేమ పెళ్లి చేసుంటారు కొందరు.
పెద్దలు చూసే పెళ్లిలో డబ్బు ఉన్న వారిని, కుటుంబం ఉన్న వారిని, మంచి మనసు ఉన్న వారిని ఇలా ఎన్నో రకాలుగా చూసి చేస్తుంటారు. కానీ కొందరు డబ్బు ఆశకు వృద్ధులతో కూడా పెళ్లి చేస్తుంటారు. ఇలా ముసలివారితో పెళ్లి చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారో కూడా తెలిపారు చాణక్యుడు. ఒకసారి అవేంటో తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధం గురించి తెలుపుతూ ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే వారి జీవితం సంతోషంగా ఉండకపోవచ్చు అని తెలిపారు. అంతేకాదు పెళ్లి చేసుకునే జంట మధ్య వయసు తేడా కూడా తక్కువే ఉండాలని తెలిపారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎలా తొలగించాలో కూడా తెలిపారు. జీవితం బాగుండాలంటే భార్యాభర్తలు అన్నింటికంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని తెలిపారు.
పెళ్లి బంధాన్ని ఇద్దరు గౌరవించాలి. గొడవలు పెట్టుకుంటూ ఉంటే ఆ వైవాహిక జీవితం ఎప్పుడు దు:ఖం తో నిండి ఉంటుంది. ఒకరికొకరు సరిపోయే వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోగలుగుతారు. ఇలా కాకుండా వృద్ధులు, యువతిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టం. ఆ దాంపత్యం ఎక్కువ రోజులు నిలవడం కూడా కష్టమే అన్నారు చాణక్యుడు.