Tollywood Star Hero : సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఎన్నో దీక్షలు చేస్తారు. ఛాన్స్ వచ్చాక పరిస్థితి ఎలా ఉన్నా.. ఒక్క ఛాన్స్ కోసం మాత్రం ఆరాటపడుతూ ఉంటారు. కొందరు వారసత్వంతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటే..మరికొందరు మాత్రం స్వతహాగా ఎదిగిన వారున్నారు. అలా ఓ హీరో సైడ్ క్యారెక్టర్ గా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. స్టార్ హీరో రేంజ్ వరకు ఎదిగారు. అయితే చివరికి సినిమాలు వద్దనుకొని ఫాస్టర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సినిమాలంటే ఇష్టమని అయితే ఆధ్యాత్మికం కూడా జీవితానికి అవసరమని ఆ హీరో చెబుతుండడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం కష్టమే. కానీ మెగాస్టార్ చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు హీరోలు ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇలాగే హీరో రాజా సైతం సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఓ చిన్నదాన’ అనే సినిమాలో హీరో శ్రీకాంత్ పక్కన నటించిన రాజా.. మొదటి సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు. ఈయన నటన మెచ్చిన శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. హీరోగా ఈయనకు మొదటి సినిమా సక్సెస్ ఇవ్వడంతో రాజాకు పలు సినిమాల్లో హీరోగా చేయాల్సి వచ్చింది.
అయితే కొన్ని రోజుల తరువాత అవకాశాలు తగ్గడంతో సైడ్ క్యారెక్టర్ గా నటించాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘ఆ నలుగురు’ సినిమాలో రాజా నెగెటివ్ షేడ్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తున్న క్రమంలో రాజా సినిమాలకు గుడ్ బై చెప్పాడు. చివరగా 2013లో ‘ఓ మై లవ్’ అనే సినిమాలో కనిపించాడు. ఇదే సమయంలో అతనికి సినిమాల కంటే ఆధ్యాత్మిక బెటరని ఆలోచించి ఆ వైపు వెళ్లాడు.
రాజా అసలు పేరు కృష్ణ మూర్తి. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజా తల్లి చిన్నప్పుడే మరణించింది. తెలిసీ, తెలియని వయసులో తండ్రి లేకుండా పోయాడు. దీంతో బంధువుల వద్ద పెరిగిన రాజా బాగా చదువుకొని ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన క్రిస్టియన్ మతంలోకి మారాడు. సినిమాల్లో నటించడం మానేసిన తరువాత పాస్టర్ గా మారి బోధనలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాజా హైదరాబాద్ లోని ముషీరాబాద్ ద న్యూ కెవినెస్ట్ చర్చ్ లో పాస్టర్ గా ఉంటున్నారు.