https://oktelugu.com/

Chanakya Neeti: చాణక్య నీతి ఇలాంటి వ్యక్తులను అస్సలు నమ్మకండి..

జీవితం నమ్మకం అనే ఇరుసుపై ఆధారపడి ఉంటుందని అంటారు. కొన్ని పనులు నమ్మకంపై నే ఆధారపడుతాయి. కానీ ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎందుకంటే బయటి వారి కంటే బంధువులే ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. ధనం, పరువు, అవమానం ఇవన్నీ.. దగ్గరి వాళ్ల విధంగానే వతస్తున్నాయి. ఈ తరుణంలో ఒక వ్యక్తిని నమ్మే ముందు చాలా విషయాలపై అవగాహన ఉండాలని చాణక్య నీతి తెలుపుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2024 / 11:35 PM IST

    chanakya-niti

    Follow us on

    Chanakya Neeti: జీవితం నమ్మకం అనే ఇరుసుపై ఆధారపడి ఉంటుందని అంటారు. కొన్ని పనులు నమ్మకంపై నే ఆధారపడుతాయి. కానీ ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎందుకంటే బయటి వారి కంటే బంధువులే ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. ధనం, పరువు, అవమానం ఇవన్నీ.. దగ్గరి వాళ్ల విధంగానే వతస్తున్నాయి. ఈ తరుణంలో ఒక వ్యక్తిని నమ్మే ముందు చాలా విషయాలపై అవగాహన ఉండాలని చాణక్య నీతి తెలుపుతుంది. రాజనీతి సూత్రాలు మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను చాణక్యుడు ప్రజలకు చెప్పాడు. వాటిని పాటిస్తున్న కొందరు తమ జీవితాలను ఆనందమయం చేసుకున్నారు. అయితే నమ్మకం అనే విషయంపై చాణక్యుడు కొన్ని సూత్రాలను వివరించాడు. ఒక వ్యక్తిని నమ్మే ముందు ఎలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలో చెప్పాడు. అవేంటంటే?

    డబ్బు:
    ప్రస్తుతం ఇదే జీవితాన్ని నడిపిస్తుంది. డబ్బు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద తక్కువగా..మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో తక్కువగా డబ్బు ఉన్నవాళ్లకు అత్యవసం అయినప్పడు ఇతరులను అడగాల్సిన రావొచ్చు. ఇలాంటి సమయంలో ఆ వ్యక్తికి డబ్బు ఇవ్వాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాలి. అయితే ఆ వ్యక్తిని నమ్మాలంటే ముందుగా కొన్ని రోజలు పాటు తక్కువ మొత్తంలో సాయం చేయాలి. ఈ డబ్బు రిటర్న్ ఇచ్చే సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసుకోవాలి. కష్టపడి డబ్బు ఇవ్వాలన్న తప్పన ఉంటే ఆ వ్యక్తిని నమ్మొచ్చు.

    త్యాగం:
    కొందరు తమ కోసం కాకుండా ఇతరుల కోసమే పుట్టాడని అంటారు. అంటే ఇతరులకు సాయం చేయడానికి ముందకు వచ్చే కొందరు వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వారు జీవితంలో ఉంటే వారు అదృష్టవంతులే. చిన్న విషయాల్లోనూ వీరు ఆ పని పూర్తి చేయాలన్న తపన ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను ఏమాత్రం వెనుకాడకుండా నమ్మొచ్చు.

    కుటుంబం:
    ఒక వ్యక్తిని నమ్మాలని అనుకున్నప్పుడు అతని కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాలి. అతడు ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేస్తూ కటుుంబ బాధ్యతలను మోసే వ్యక్తిని నమ్మొచ్చు. ఎందుకంటే తాను ఇతరులకు అన్యాయం చేస్తే తన కటుుంబం ఛిన్నాభిన్నం అవుతుందని బాధపడుతాడు.

    లక్షణాలు:
    ఈ భూమ్మీద రకరకాల మనుషులు ఉన్నారు. అలాగే వారి లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో వారు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. మంచి లక్షణాల కంటే చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిని నమ్మాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా కొందరు జనం మధ్యలో మంచిగా ఉండి.. సాటు మాటున పొరపాట్లు చేసేవారికి సైతం దూరంగా ఉండాలి. ఇలాంటి వారు ఎప్పటికైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని నమ్మకపోవడమే మంచిది.

    అబద్ధం
    చాలా మందికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది.కొందరు సరదాగా చెప్పానని అనుకున్నా.. అలాంటి వారిని నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వారు రియల్ లైఫ్ లోనూ అబద్ధం ఆడే అవకాశం ఉంది.