Gold Card Visa
Gold Card Visa : అమెరికా(America)లో అక్రమంగా ఉంటున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ఉంటున్నవారు కూడా ఆదేశ అభివృద్ధికే పాటుపడుతున్నారు. అయినా వారు అక్రమంగా ఉంటున్నారన్న నెపంతో వారి దేశాలకు పంపిస్తున్నారు. అదే స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నవారు మాత్రం అమెరికా రావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ కార్డ్ వీసా(Gold Card Visa) ప్రవేశపెట్టారు. గోల్డ్ కార్డ్ వీసా కావాలనుకునేవారు అమెరికాలో 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ.43.54 కోట్లు) వెచ్చించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్ అమెరికా పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే ఈ ప్రతిపాదనతో చాలా మంది భారతీయులు(Indians) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమెరికా గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్నవారిలో అత్యధిక మంది భారతీయులే. ఇది అందాలంటే కొందరికి 50 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రతిపాదనతో అమెరికాలో వలస విధానంలో పెను మార్పులు రానున్నాయి. ఇన్నాళ్లూ అమలులో ఉన్న ఈబీ–5 ప్రోగ్రాం మాయం అవుతుంది.
ఏమిటీ గోల్డ్ కార్డు వీసా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ గోల్డ్ కార్డును ప్రతిపాదించారు. 5 మిలియన్ డాలర్లు భరించగలిగితే నేరుగా అమెరికా పౌరసత్వం(America Citizanship) లభిస్తుంది. గతంలోని ఈబీ–5 వీసా 6పకారం 8 లక్షల లక్షల డాలర్ల నుంచి 10.5 లక్షల డాలర్లు(2022లో మార్చిన విధానం) పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించాలి. 1992లో కాంగ్రెస్ ఈబీ –5ను ప్రవేశపెట్టింది. కానీ, తాజాగా ప్రతిపాదించిన గోల్డ్ కార్డ్ సంపన్నుల ప్రీమియం ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. దీనిలో ఉద్యోగసృష్టి వంటి అంశాలను వెల్లడించలేదు. దీనిని రష్యాకు చెందిన కుబేరులకు కూడా విక్రయించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
భారతీయులపై ప్రభావం ఎంత..?
అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల జాబితాలో భారతీయులే ఎక్కువ. కానీ, ట్రంప్ ఆఫర్‌తో సంపన్న భారతీయులు వేగంగా తమ కలను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే వీరి సంఖ్య తక్కువ. గతంలో ఈబీ–5 శ్రేణిలో పెట్టుబడి పెట్టగలిగేవారికి కష్టమైంది. ఈ పనిణామాల నేపథ్యంలో చాలా మందికి గ్రీన్ కార్డు(Green Card) కలగానే మిగిలిపోతుంది. బిజినెస్ మ్యాగ్నెట్స్‌కు మాత్రం లబ్ధి కలుగుతుంది.
Also Read : అమెరికా వలస విధానాల్లో సంచలన మార్పులు.. ట్రంప్ కొత్త బిల్లులో కీలక ప్రతిపాదనలు
ఇన్వెస్టర్ వీసా మాయం..
గోల్డ్ కార్డు వీసా రాకతో.. ఈబీ–5 ఇన్వెస్టర్‌ను రెండు వారాల్లో భర్తీ చేయనుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుథ్నిక్ తెలిపారు. ఇప్పటికే ఈబీ–5 విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా తప్పు పట్టారు. అదో చెత్త, మోసపూరిత విధానమని పేర్కొన్నారు. ఈబీ–5తో పోలిస్తే కొత్త దానిలో వెచ్చించాల్సిన మొత్తం 5 రెట్లు ఎక్కువ. ఇది చిన్న , మధ్యస్థాయి ఇన్వెస్టర్లు భరించలేరు. ఈబీ–5లో నిధులు సేకరించే లేదా కొన్నిరకాల రుణాలు తీసుకునే వారికి అవకాశం చాలా తక్కువ.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..
గోల్డ్ కార్డు కోసం 5 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. సంపన్నులు, ధనికుల అవసరాల కోసం స్పాన్సర్ చేసే ప్రతిభావంతులకు ఇదే మార్గమని ట్రంప్ పేర్కొన్నారు. కంపెనీలు కూడా తమకు కావాల్సిన అత్యంత కీలక ఉద్యోగులను ఈ వీసా కింద అమెరికాకు తీసుకురావచ్చు.
ఎన్ని గోల్డ్ కార్డుల జారీ చేయవచ్చు?
అమెరికా అధ్యక్షుడి ఇప్పటి లెక్క ప్రకారం దాదాపు 10 లక్షల గోల్డ్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. కోటి విక్రయిస్తే అమెరికా ద్రవ్యలోటు తగ్గుతుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ప్రాథమికంగా వీటి జారీకి కచ్చితమైన పరిమితి లేదు. దేశంలోకి నగదు రప్పించడమే లక్ష్యంగా ఈ స్కీం తెచ్చారు.
కాంగ్రెస్ ఆమోదిస్తుందా..?
ట్రంప్ తాజాగా తెచ్చిన గోల్డ్ కార్డు వీసా అమలు కావాలంటే ఆ దేశ కాంగ్రెస్ అనుమతి ఉండాలా అంటే అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఒకవేళ దావాలు, రాజకీయ ప్రతిపక్షం ఆంఓదళన వ్యక్తం చేస్తే మాత్రం అమలులో జాప్యం జరుగుతుంది.
Also Read : ట్రంప్ పేరిట అమెరికాలో నోట్లు..హవ్వా అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు