Chanakya gave 4 amazing principles : ఇతను తన నీతి శాస్త్రంలో మనిషి కెరియర్, వైవాహిక జీవితం, వ్యక్తిగత జీవితం గురించి అనేక నియమాలను తెలిపారు. మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే ఎలాంటి నియమాలను పాటించాలి అనే దాని గురించి కూడా ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు. అప్పట్లో ఆచార్య చాణిక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని అందులోని నియమాలను ఇప్పటికి కూడా చాలామంది అనుసరించి జీవితంలో విజయం సాధిస్తున్నారు. అన్ని విషయాలపై కూడా బాగా పట్టు ఉన్న ఆచార్య చానిక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక నియమాలను తెలిపాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న, ఉన్నత జీవితాన్ని గడపాలన్నా కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి అని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నాడు. ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విజయం సాధించాలి అంటే ఈ నియమాలను పాటించాలి.
సమయం చాలా విలువైనది. కాబట్టి ఇటువంటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్లు మాత్రమే తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు. విలువైన సమయాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు వెనక్కి తోసుకున్నట్టే అంటూ ఆచార్య చానిక్యుడు చెప్తున్నారు. మీ చుట్టూ ఉన్న వారిని బట్టే మీ జీవితం ఉంటుంది. మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో సహవాసం చేస్తారో మీ జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. చెడ్డవారితో మీరు చేసే సహవాసం మిమ్మల్ని దిగజారే లాగా చేస్తుంది. అదే మీరు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే మీ తెలివిని పెంచేలా చేస్తుంది. మీ చేతిలో ఉన్న మీ ప్రణాళికలు అలాగే మీ డబ్బులు, మీ బలహీనతలు గురించి ఎదుటి వ్యక్తులకు అసలు చెప్పకూడదు.
Also Read : చాణక్యనీతి: జీవితంలో ఆనందం నిండాలంటే ఇలా చేయండి..
ఇటువంటి విషయాల్లో మీ జీవితాన్ని దిగజారే లాగా చేస్తాయని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నారు. జీవితంలో విజయం సాధించాలి అంటే ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయకుండా గొప్ప ప్రణాళికలతో ముందుకు సాగాలి. ముఖ్యంగా మీరు సహవాసం చేసే వ్యక్తులను బట్టి సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మంచి వ్యక్తులతో స్నేహం మిమ్మల్ని తెలివైన వ్యక్తులుగా మారుస్తుంది. అలాగే చెడు లక్షణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం మిమ్మల్ని సమాజంలో దిగజారే లాగా చేస్తుంది అని ఆచార్య చానిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు.