Causes of High Cholesterol: ఈమధ్య బాగా భయపెడుతున్న విషయం కొలెస్ట్రాల్. దీనినే కొవ్వు అని కూడా అంటారు. శరీరంలో కొవ్వు ఉండడం అవసరమే. కానీ ఇది మితిమీరితే ప్రమాదమే. అయితే ఎవరు కావాలని కొవ్వును తయారు చేసుకోరు. మనం తినే ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యంపై పాటించే పద్ధతులతోనే కొలెస్ట్రాల్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. నేటి కాలంలో బిపి, షుగర్ లతోపాటు కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉండే బాధితులు పెరిగిపోతున్నారు. అయితే కొలెస్ట్రాల్ పెరగకుండా సరైన ఆహారం తీసుకుంటున్నామని కొందరు చెబుతున్నారు. కానీ నాణ్యమైన ఆహారం తీసుకున్నా.. కొన్ని అలవాట్ల కారణంగా అదనపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం. మరి అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read: ధోని సొంత ఊరిలో.. అద్భుతమైన వంటకం.. తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు
మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. కానీ నేటి కాలంలో చాలామంది రకరకాల కారణాలవల్ల సరైన నిద్ర పోవడం లేదు. కొందరు రాత్రులు టీవీ, మొబైల్ తో కాలక్షేపం చేస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నారు. ఇలా నిద్రకు భంగం కలగడం వల్ల మెదడులో అనేక చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇది రక్తంపై ప్రభావం పడి కొలెస్ట్రాలను నియంత్రించే శక్తిని తగ్గిస్తుంది. దీంతో అనుకోకుండా అని కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.
ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది అనేక రకాల ఒత్తిడితో ఉంటున్నారు. అయితే ఈ ఒత్తిడి లను దాదాపు తగ్గించుకుంటేనే మంచిది. ఒత్తిడి కారణంగా శారీరక వ్యాయామంపై శ్రద్ధ చూపలేరు. దీంతో కొలెస్ట్రాల్ అలాగే ఉండిపోయి పేరుకు పోతుంది. అయితే ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఎంతోకొంత సమయం తీసుకొని వ్యాయామం చేయడంవల్ల ఒత్తిడి నుంచి దూరం అవుతారు. ఫలితంగా కొలెస్ట్రాల్ను వేయకుండా చేసుకోగలుగుతారు.
Also Read: డయాబెటిక్ ఉన్నా పర్వాలేదు.. ఈ బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు..
గతంలో కంటే ఇప్పుడు రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది ఇంటి ఫుడ్ ను మానేసి రెస్టారెంట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అయితే బయట విక్రయించే ఆహార పదార్థాల్లో టెస్ట్ కోసం రకరకాల పదార్థాలు వాడుతూ ఉంటారు. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను పెరిగేలా చేస్తాయి. అయితే ఒకసారి అధికంగా కొలెస్ట్రాల్ పెరిగితే తగ్గించడం కష్టమవుతుంది. అందువల్ల ముందుగానే కొలెస్ట్రాల్ పెరగకుండా లైట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి.
ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ తక్కువ అవుతుంది. చాలామంది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూర్చొని పనిచేస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పనులు దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కూడా శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల శరీరంలో హెచ్ డి ఎల్ స్థాయిలో తగ్గుతున్నాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే ఉండిపోతుంది. గంటల తరబడి కూర్చొని పనిచేసేవారు కనీసం 30 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇలా క్రమ పద్ధతిలో విధులు నిర్వహిస్తే కొలెస్ట్రాల్ను రానీయకుండా చేయవచ్చు.