Car Wheels: కారు డ్రైవింగ్ అన్నా లేదంటే కారు జర్నీ అన్నా కూడా చాలా ఎంజాయింగ్ గా అనిపిస్తుంది. అయితే సినిమాల్లో కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు మనం చూస్తే కారు ముందుకు వెళ్తున్నా కూడా వీల్స్ మాత్రం వెనక్కు వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఇది మనందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. అయితే అవి అలా ఎందుకు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

దీన్ని వ్యాగెన్ వీల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అసలు కారు నడిచేటప్పుడు వీడియో రికార్డు చేసేటప్పుడు అన్నింటినీ ఒకేసారి రికార్డు చేయకుండా.. ఒక సెకనులో 24ఫొటోలను తీసి వాటన్నింటినీ కలిపి వీడియోగా మనకు చిత్రీకరిస్తుంది. అదువల్ల మనకు అది వీడియోగా కనిపిస్తుంది. అయితే మన మైండ్ కూడా అంతే.. వేగంగా వెళ్తున్న వాటిని ఒకేసారి మన మైండ్ రికార్డ్ చేయలేదు. ఒక సెకనులో 24ఫొటోలను తీసి మళ్లీ వాటన్నింటినీ కలిపి ఒక వీడియోగా కనిపిస్తుంది.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే.. ఒక వీల్‌ను మనం చూస్తున్నప్పుడు.. వీల్ తిరుగుతుంది. కానీ గుడ్రంగా తిరగడం వల్ల మనం ఎక్కడి నుంచి అయితే చూడటం మొదలు పెడుతున్నామో తిరిగి అక్కడికే ఆ చక్రం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే వీటన్నింటినీ కలిపి చూస్తుంటే.. అవన్నీ మనకు వరుసగా కనిపిస్తాయి. అలా మన మైండ్ 24ఫ్రేమ్‌లను కలిపి చూస్తుంది.

దీని వల్ల మొదలు పెట్టిన వద్దే ఆ వీల్ ఆగిపోయి మనకు వెనక్కు తిరిగినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి కెమెరా రికార్డు స్పీడు కన్నా వీల్ కొంచెం లేటుగా తిరిగితే మనకు అది వెనక్కు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. మన కండ్లు వేగంగా తిరుగుతున్న వాటిని చూస్తుంటే అది ఉన్న చోట నుంచే తిరగబడి పోతున్నట్టు మనకు అర్థం అవుతుంది. కానీ వాస్తవానికి అది ముందుకు తిరుగుతుంది.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?