https://oktelugu.com/

Vadde Naveen: వ‌డ్డె న‌వీన్ బ‌యోగ్ర‌ఫీ.. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఉన్న న‌వీన్ ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉండ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..?

Vadde Naveen: సినిమా రంగం అంటేనే అవ‌కాశాల మీద న‌డిచే ప‌డ‌వ‌. అవ‌కాశాలు రాలేదంటే అక్క‌డికక్క‌డే మునిగిపోతుంది. అయితే టాలీవుడ్‌లో ఎంతో మంది ఎలాంట స‌పోర్టు లేకుండా వ‌చ్చి హీరోలుగా రాణించారు. కానీ సుదీర్ఘంగా ఆ స్టార్‌డ‌మ్‌ను కాపాడుకున్న‌ది మాత్రం కొంద‌రే. చాలామంది మ‌ధ్య‌లోనే కెరీర్‌ను ఆపేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో వ‌డ్డె న‌వీన్ కూడా ఒక‌రు. కోరుకున్న ప్రియుడు మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు న‌వీన్‌. అయితే న‌వీన్‌కు అంత‌కు ముందే ఇండ‌స్ట్రీలో […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 24, 2022 3:36 pm
    Follow us on

    Vadde Naveen: సినిమా రంగం అంటేనే అవ‌కాశాల మీద న‌డిచే ప‌డ‌వ‌. అవ‌కాశాలు రాలేదంటే అక్క‌డికక్క‌డే మునిగిపోతుంది. అయితే టాలీవుడ్‌లో ఎంతో మంది ఎలాంట స‌పోర్టు లేకుండా వ‌చ్చి హీరోలుగా రాణించారు. కానీ సుదీర్ఘంగా ఆ స్టార్‌డ‌మ్‌ను కాపాడుకున్న‌ది మాత్రం కొంద‌రే. చాలామంది మ‌ధ్య‌లోనే కెరీర్‌ను ఆపేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో వ‌డ్డె న‌వీన్ కూడా ఒక‌రు. కోరుకున్న ప్రియుడు మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు న‌వీన్‌.

    Vadde Naveen

    Vadde Naveen

    అయితే న‌వీన్‌కు అంత‌కు ముందే ఇండ‌స్ట్రీలో మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అత‌ని తండ్రి వడ్డే రమేష్ అప్ప‌టికే పెద్ద నిర్మాత‌. కాగా తండ్రికి ఉన్న బ్యాక్ గ్రౌండ్‌తో సినిమాల్లోకి న‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు న‌వీన్‌. అత‌నికి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం పెళ్లి అనే చెప్పుకోవాలి. ఆ త‌ర్వాత వ‌చ్చిన మనసిచ్చి చూడు, మా బాలాజీ లాటి మూవీల‌తో పాటు ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలు కూడా మంచి స‌క్సెస్ సాధించాయి.

    Also Read:  ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల‌కు విలువ లేదా?

    చాలామంది లాగే న‌వీన్ కూడా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. త‌క్కువ టైమ్ లోనే స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. ఈ జోష్ లోనే అత‌ను దాదాపు 28 మూవీల్లో హీరోగా చేశాడు. అయితే మ‌ధ్య‌లో అవ‌కాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాడు. కాగా అవి కూడా అత‌నికి పెద్ద‌గా క‌లిసి రాక‌పోవ‌డంతో ఎలాంటి అవ‌కాశాలు అత‌ని ద‌గ్గ‌ర‌కు రాలేదు.

    ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న‌ప్పుడే అత‌ను సీనియ‌ర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయారు. చిన్న‌పాటి గొడ‌వ‌ల‌తో చివ‌ర‌కు విడిపోయారు. ఈ వివాదం కూడా అత‌ని సినీ కెరీర్ పై ప్ర‌భావం చూపింది. ఈ కార‌ణంగా అత‌ను కొన్ని రోజులు గ్యాప్ కూడా తీసుకున్నాడు.

    Vadde Naveen

    Vadde Naveen

    ఇలా గ్యాప్ తీసుకోవ‌డంతో అత‌నికి సినిమా అవ‌కాశాలు కూడా పెద్ద‌గా రాలేదు. చివ‌ర‌గా 2016లో మంచు మనోజ్ తో క‌లిసి ఎటాక్ అనే మూవీలో న‌టించాడు. దీన్ని ఆర్జీవీ డైరెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాల్లో క‌నిపించ‌డం మానేశారు. ఇక వేరే అమ్మాయితో రెండో పెండ్లి చేసుకున్న న‌వీన్ కుటుంబంతో క‌లిసి హైద‌రాబాద్‌లో నే హాయిగా జీవిస్తున్నారు. ఈ న‌డుమ‌నే అత‌ని కొడుక్కి పంచెక‌ట్టు వేడ‌క కూడా వైభ‌వంగా నిర్వ‌హించ‌గా.. దీనికి చిరంజీవిలాంటి సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. అయితే అత‌ను త్వ‌ర‌లోనే విల‌న్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అదే జ‌రిగితే సిల్వ‌ర్ స్క్రీన్‌పై అత‌న్ని చూసే అవ‌కాశం అత‌ని అభిమానుల‌కు ద‌క్కుతుంది.

    Also Read:  లేచింది మహిళా లోకం… రాజకీయాలను శాసించిన టాలీవుడ్ హీరోయిన్స్

    Tags