Car Lights : కారు డ్రైవ్ చేసేటప్పుడు హెడ్‌లైట్ల సరైన సెలక్షన్ భద్రతకు, సౌకర్యానికి చాలా ముఖ్యం. చాలా మంది పసుపు లైట్లు (Yellow Light) వాడాలా లేదా తెలుపు లైట్లు (White Light) వాడాలా అని తేల్చుకోలేకపోతుంటారు. రెండింటికీ వాటి లాభాలు, నష్టాలు ఉన్నాయి. కానీ సరైనది సెలక్ట్ చేసుకోవడం వారి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: చైనాను మించి పోయిన ఇండియా.. సంగీతానికి స్టెప్పులేసే ఎలక్ట్రిక్ ఎస్యూవీ
పసుపు లైట్లు
పసుపు లైట్లు సాధారణంగా హాలోజన్ బల్బుల్లో లేదా ఫాగ్ లైట్లలో కనిపిస్తాయి. పొగమంచు, వర్షం లేదా మంచు వంటి వాతావరణంలో ఈ లైట్లు చాలా బాగా పనిచేస్తాయి. వీటి తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి, ఈ కాంతి పొగమంచులో వ్యాపించకుండా రోడ్డుపై నిలబడుతుంది. దీని వల్ల డ్రైవర్‌కు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది, విజిబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా, పసుపు కాంతి కళ్ళపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల లాంగ్ డ్రైవింగ్‌లో అలసట తగ్గుతుంది.
తెలుపు లైట్లు
తెలుపు లైట్లు లేటెస్ట్ LED లేదా HID బల్బుల నుంచి వస్తాయి. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. మంచి వాతావరణంలొ, నగర ప్రాంతాల్లో ఇవి చాలా దూరం వరకు స్పష్టమైన కాంతినిస్తాయి. దీని వల్ల డ్రైవింగ్ ఈజీ అవుతుంది. అయితే, వీటి ఎక్కువ ప్రకాశం ఎదురుగా వచ్చే డ్రైవర్లకు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వర్షం లేదా పొగమంచులో ఈ కాంతి వ్యాపించి విజిబిలిటీని తగ్గిస్తుంది.
ఎప్పుడు ఏ లైటు ఎంచుకోవాలి?
మీరు సిటీ రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ ఉంటే, వాతావరణం సాధారణంగా ఉంటే తెలుపు లైట్లు సరిగ్గా ఉంటాయి. అదే వాతావరణంలో, పొగమంచులో లేదా హైవేపై ఎక్కువగా డ్రైవ్ చేయాల్సి వస్తే, పసుపు లైట్లు లేదా ఫాగ్ లైట్లు మంచి ఎంపిక. మనం తప్పు వాతావరణంలో లేదా పరిసరాల్లో తప్పు రకమైన లైట్లను ఉపయోగించినప్పుడే తప్పు జరుగుతుంది. ప్రతి లైటును తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం, తద్వారా మనల్ని మనం, ఇతరులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. కాబట్టి వాతావరణం, రోడ్డు పరిస్థితిని బట్టి లైట్లను ఎంచుకోండి.. రోడ్డుపై బాధ్యతగా వాహనం నడపండి.
Also Read : గవర్నమెంట్ కొత్త స్కీం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఫ్రీ వైద్యం