Cancer Medicine: ఇక ఆ చావులు ఉండవు.. మానవాళికి సైన్స్ ఇచ్చిన అతిగొప్ప బహుమతి

Cancer Medicine: ‘క్యాన్సర్’. ఇది సోకితే సామాన్యుడి నుంచి సెలబ్రెటీలకు వరకూ కృంగి కృశించి మరణించాల్సిందే. రేడియో థెరపీ ఉన్నా అదెంతో బాధతో కూడుకున్నది. కొన్నింటికి మాత్రమే ఈ చికిత్స ఉంది. కొన్ని రకాల క్యాన్సర్ లు, మెదడుకు సోకే క్యాన్సర్ లకు అసలు చికిత్స అందుబాటులో లేదు. ఎంతో మంది దీని బారిన పడి మరణించిన వారే. ‘న్యూరో ఇండోక్రైన్’ అనే అరుదైన క్యాన్సర్ తో బాలీవుడ్ గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారు. దానికి […]

Written By: NARESH, Updated On : June 8, 2022 9:33 am
Follow us on

Cancer Medicine: ‘క్యాన్సర్’. ఇది సోకితే సామాన్యుడి నుంచి సెలబ్రెటీలకు వరకూ కృంగి కృశించి మరణించాల్సిందే. రేడియో థెరపీ ఉన్నా అదెంతో బాధతో కూడుకున్నది. కొన్నింటికి మాత్రమే ఈ చికిత్స ఉంది. కొన్ని రకాల క్యాన్సర్ లు, మెదడుకు సోకే క్యాన్సర్ లకు అసలు చికిత్స అందుబాటులో లేదు. ఎంతో మంది దీని బారిన పడి మరణించిన వారే. ‘న్యూరో ఇండోక్రైన్’ అనే అరుదైన క్యాన్సర్ తో బాలీవుడ్ గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారు. దానికి చికిత్స లేకపోవడంతో ఈ ప్రఖ్యాత నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఇతడే కాదు చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి తనువు చాలించారు. కొందరు చికిత్స తీసుకొని మళ్లీ పునర్జన్మగా భావిస్తూ జీవిస్తున్నారు.

Cancer Medicine

ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ భూతంపై వైద్యశాస్త్రం తాజాగా విజయం సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా వైద్యులు క్లినికల్ ట్రయల్స్ లో 18 మంది రోగులకు ‘డోస్టర్లిమాబ్’ అనే ఒక కొత్త డ్రగ్ ను ఆరునెలల పాటు అందించి ‘క్యాన్సర్’ను పారదోలారు.

Also Read: JP Nadda- Janasena: వైసీపీ వద్దు.. బీజేపీదే అధికారం..మరి జనసేన పరిస్థితి ఏంటి?

న్యూయార్క్ మొమోరియల్ స్లోవన్ కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ లో రెక్టల్ (మలాశయం) క్యాన్సర్ బారిన పడిన 18 మంది రోగులకు ‘డోస్టర్లిమాబ్’ అనే ఒక కొత్త డ్రగ్ ను ఆరు నెలల పాటు అందించారు. అది ప్రతి రోగిలోనూ క్యాన్సర్ ను పూర్తిగా పారదోలడం వైద్యశాస్త్రంలో అద్భుతమైంది. వీరందరిలోనూ క్యాన్సర్ కణితి మటుమాయమైపోయిందని ఫలితాలు వెల్లడించాయి.

ఈ వైద్యం చేసిన శాస్త్రవేత్త, డాక్టర్ లూయిస్ ఎడియాజ్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిణామం సంభవించిందని పేర్కొన్నారు.

Cancer Medicine

ఇక ప్రతి క్యాన్సర్ రోగిలో క్యాన్సర్ కణితి మటుమాయం కావడం ఇదివరకూ ఎన్నడూ వినలేదని చెప్పారు. ట్రయల్ పరీక్షల్లో వీరిలో ఏ ఒక్కరూ దుష్ఫలితాలకు గురికాకపోవడం గొప్ప విషయమని కొనియాడారు.

18 మంది రోగులు తమలో క్యాన్సర్ కణితి తొలగిపోయిందని తెలుపగానే ప్రపంచం మొత్తం ఈ వార్త సంచలనమైంది. క్యాన్సర్ రోగుల పాలిట సైన్స్ ఇచ్చిన అతిగొప్ప బహుమతిగా దీన్ని అందరూ అభివర్ణిస్తున్నారు. శరీరంలోని ఇతర భాగాలకు సోకకుండా స్థానికంగానే మలాశయంలో ఏర్పడిన ఆ క్యాన్సర్ ను డోస్టర్లిమాబ్ మందు పూర్తిగా నిర్మూలించడం విశేషం. ఇది రోగుల పాలిట ఒక గొప్ప ఆశలను రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం మరింత ఎక్కువమంది రోగులపై ఈ మందును ప్రయోగిస్తున్నారు. వీరిలో కూడా క్యాన్సర్ తొలిగిపోతో దీన్ని పరీక్షల అనంతరం మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Also Read:Nani- Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీలో నాని?… నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడుగా!

Tags