Pakistan Crisis: ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడానికి కారణాలేంటి? ఒక్కో దేశం ఇలా డీలా పడుతుంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి? పాలకులు ఏం చేస్తున్నారు? వాస్తవ పరిస్థితులు పట్టవా? ఎందుకీ దురవస్థ? ఏం జరుగుతోందనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు ఇలా ముసురుతుంటే సామాన్యుడి జీవనం ఎలా గడిచేది? వాడికి ఎలా అవసరాలు చేకూరేది. దీంతో పాకిస్తాన్ మాత్రం తమ ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటామని చెబుతున్నా అందులో వాస్తవం లేదనే విషయం తెలుస్తోంది.

దేశంలో ఏం జరుగుతోంది. ఆర్థిక మూలాలు ఎందుకు దెబ్బ తింటున్నాయి. పరిస్థితులు ఎందుకు చేజారిపోతున్నాయి. రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది. ఫలితంగా నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 209, డీజిల్ ధర రూ. 204కు చేరింది. దీంతో సామాన్యుడు చతికిల పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దేశంలో ధరలు ఇలా పెరిగితే భవిష్యత్ లో మరిన్ని కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు ఏకంగా రూ. 60 మేర పెరడం ఆందోళనకరమే.
Also Read: Cancer Medicine: ఇక ఆ చావులు ఉండవు.. మానవాళికి సైన్స్ ఇచ్చిన అతిగొప్ప బహుమతి
ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు స్నేహహస్తం అందించాలని సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా సాయం చేయాలని కోరుతోంది. కానీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉండటంతో ఏ దేశం కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకమే. దీంతో పాకిస్తాన్ కోలుకునే అవకాశాలు కానరావడం లేదు. ఇంకింత అగాధంలోకి పడిపోయే ప్రమాదమే కనిపిస్తోంది.

దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించే ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ చెబుతున్నారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడాలంటే డబ్బు కావాల్సిందే. ప్రస్తుతం దేశంలో సంక్షోభం తలెత్తడానికి డబ్బు లేకపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకున్నా ప్రయోజనం శూన్యమే. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని బ్యాంకుల్లో ఉన్న ధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడదామంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీంతోనే పాక్ సంక్షోభంలో మునగడంతో ఎన్ని చర్యలు తీసుకున్నా ఏం లాభం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read:Nani- Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీలో నాని?… నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడుగా!
[…] Also Read: Pakistan Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. దివా… […]
[…] Also Read:Pakistan Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. దివా… […]