Cancer: మందు బాబులు ఇది విన్నారా.. అధికంగా మద్యం సేవిస్తే 6 రకాల క్యాన్సర్లట!

అధికంగా మద్యం సేవిస్తే తప్పకుండా క్యాన్సర్ బారిన పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ఒక క్యాన్సర్ బారిన కాకుండా మొత్తం ఆరు రకాల క్యాన్సర్ల బారిన పడతారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. మరి ఆ ఆరు క్యాన్సర్లు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2024 7:40 pm

Diabetic Drinks Alcohol

Follow us on

Cancer:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మన ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది అధికంగా మద్యం సేవిస్తుంటారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసిన కూడా పట్టించుకోకుండా సేవిస్తుంటారు. అసలు పండుగలు, వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇక తాగే పనిలోనే ఉంటారు. అయితే అధికంగా మద్యం సేవిస్తే తప్పకుండా క్యాన్సర్ బారిన పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ఒక క్యాన్సర్ బారిన కాకుండా మొత్తం ఆరు రకాల క్యాన్సర్ల బారిన పడతారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. మరి ఆ ఆరు క్యాన్సర్లు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

 

తక్కువగా మద్యం తాగే వారిలో పెద్దగా క్యాన్సర్ లక్షణాలు లేవట. కానీ ఐదు శాతం కంటే ఎక్కువగా మద్యం సేవించిన వారికి తప్పకుండా ఈ ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. అధికంగా మద్యం సేవించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, మెడ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, పేగు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటివి వస్తాయని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. మూడు కన్నా ఎక్కువ సార్లు రోజులో ఆల్కహాల్ తీసుకుంటే ఈ క్యాన్సర్లు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఈ క్యాన్సర్లు మాత్రమే కాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే పురుషుల్లో అయితే ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. క్యాన్సర్‌తో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

క్యాన్సర్ మద్యం వల్ల మాత్రమే కాకుండా జన్యుపరమైన కారణాలు, వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత అలవాట్లు, జీవనశైలి, ధూమపానం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. ఒక్క పొగాకులోనే కేవలం 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఈ అలవాట్లు అన్ని కూడా క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా బయట దొరికే ఫాస్ట్‌పుడ్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల కూడ గర్భాశయ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి కేవలం మద్యం మానేయడమే కాకుండా ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. అప్పుడే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ప్రమాదకర క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.