https://oktelugu.com/

Cancer: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే మీకు నోటి క్యాన్సర్ ఉన్నట్లే!

పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఈరోజుల్లో చాలామంది క్యాన్సర్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇవే కాకుండా గుండె సమస్యలు, మధుమేహం వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలి మారడం వల్ల కొందరు పొగాకు సేవిస్తున్నారు. వీటిని తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పిన కూడా వినడం లేదు. ఎక్కువగా సిగరెట్ తాగితే నోటి క్యాన్సర్ అనేది తప్పకుండా వస్తుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 04:34 AM IST

    Oral cancer

    Follow us on

    Cancer: ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పని వల్ల బిజీ అయిపోయి కనీసం వాళ్ల ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వాళ్లు ఒత్తిడికి గురి అయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఈరోజుల్లో చాలామంది క్యాన్సర్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇవే కాకుండా గుండె సమస్యలు, మధుమేహం వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలి మారడం వల్ల కొందరు పొగాకు సేవిస్తున్నారు. వీటిని తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పిన కూడా వినడం లేదు. ఎక్కువగా సిగరెట్ తాగితే నోటి క్యాన్సర్ అనేది తప్పకుండా వస్తుంది. కేవలం సిగరెట్ తాగిన వాళ్లకే వస్తుందని అనుకోలేం. మారిన జీవనశైలి వల్ల చాలా మందికి నోటి క్యాన్సర్ వస్తుంది. అయితే నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి అవేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    నోటి దగ్గర పుండ్లు
    ఈ నోటి క్యాన్సర్ ఉన్న వారిలో ఎక్కువగా నోటి దగ్గర పుండ్లు వస్తాయి. సాధారణంగా జ్వరం వస్తే ఎవరికైనా నోటి దగ్గర పుండ్లు వస్తాయి. కానీ ఇవి ఎక్కువ రోజులు అయిన కూడా తగ్గకపోతే కాస్త ఆలోచించాల్సిందే. అలాగే ఇవి బాగా నొప్పిని కలిగిస్తాయి. తీవ్రంగా నొప్పిగా అనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి.

    గడ్డలు గట్టిపడటం
    పెదవి దగ్గర రక్తం, చీము వంటివి కారడం, నోటి చుట్టూ ఎక్కడైనా పెరుగుదల, నోటి లోపం గడ్డలా ఏర్పడటం వంటివి జరిగిన కూడా వైద్యుని సంప్రదించాలి. ఇవి ఉన్నట్లు అనిపించకపోయిన అలా పెరుగుతుంటాయి. ఇవి ఉంటే ఆహారాన్ని సరిగ్గా మింగలేరు. గొంతులో కనీసం వాటర్ వేసుకున్న కూడా నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఫుడ్ తినేటప్పుడు గొంతు బాగా నొప్పిగా అనిపిస్తుంది. అలాగే మాటల్లో కూడా మార్పులు వస్తాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు గొంతులో శబ్ధం రావడం, పదాలు స్పష్టంగా పలక లేకపోవడం, నత్తి రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే మాత్రం సందేహ పడాల్సిందే.

    మెడలో గడ్డ
    నోటి క్యాన్సర్ ఉన్నట్లయితే మెడలో కూడా గడ్డ ఏర్పడుతుంది. మెడలోని శోషరస కణుపుల దగ్గర వాపుగా ఉంటుంది. అయితే నోటి కుహరం నుంచి మొదటిగా నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత క్యాన్సర్‌గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    బరువు తగ్గడం
    నోటి క్యాన్సర్ వస్తే సరిగ్గా ఫుడ్ తినలేరు. దీంతో ఎక్కువగా బరువు తగ్గుతారు. అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఏదో ఒక రోజు వస్తే పర్లేదు. కానీ దీర్ఘకాలికంగా ఎక్కువగా నోటి నుంచి దుర్వాసన వస్తే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. అలాగే దంతాల్లో కూడా కాస్త మార్పులు వస్తాయి. దంతాల ప్రాంతంలో తిమ్మిరి, రక్తస్రావం కావడం వంటివి జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.