SAP: కొందరికీ నీళ్లు అంటే భయం ఉంటుంది. మరికొందరికి చీకటి అంటే భయం. ఇలా ఒక్కోరికి ఒక్కోటి అంటే భయం ఉంటుంది. అలాగే కొందరికి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే సమస్య ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు సీజన్ బట్టి మారిపోతుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఈ డిజార్డర్ ఎక్కువగా వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ డిజార్డర్ ఉన్నవారు మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ డిజార్డర్ అనేది ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి వస్తాయి. ఎందుకంటే సూర్యకాంతి ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఈ డిజార్డర్‌తో బాధపడేవారికి ఆకలిలో మార్పులు వస్తాయి. అలాగే ఏకాగ్రత ఉండదు. పూర్తిగా నిద్ర లేక ఆందోళన చెంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఇలా డిప్రెషన్‌లోకి వెళ్తే ఈ సమస్య ఇంకా తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డిజార్డర్ ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వాళ్లకి వస్తుంది.
ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌తో బాధపడేవారు ఎప్పుడూ బాధగా ఉంటారు. అందరితో కలవలేరు. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఎక్కువగా తీపిగా ఉండే పదార్థాలు తినాలనే కోరిక పెరుగుతుంది. అలాగే నిద్రలో మార్పులు వస్తాయి. పూర్తిగా నిద్రపట్టదు. ఏకాగ్రత కోల్పోతారు. ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించలేరు. అలాగే ఎక్కువగా బరువు పెరగడం, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఇవన్నీ సీజన్ బట్టి మారిపోతుంటాయి. శీతాకాలంలో అయితే ఈ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి ముఖ్య కారణం పూర్తిగా సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఈ డిజార్డర్‌తో ఇబ్బంది పడతారు. ఈ డిజార్డర్ నుంచి బయట పడాలంటే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడంతో పాటు కొన్ని సహజ నియమాలు కూడా పాటించాలి. అప్పుడే ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ నుంచి విముక్తి చెందుతారు.
ఒకే ప్లేస్‌లో అలా ఉండిపోకుండా రోజూ బయటకు వెళ్లండి. అలా కాసేపు సేదతీరండి. వాకింగ్ లేదా రన్నింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోండి. బయట గాలి పీల్చడం అలవాటు చేసుకోండి. అలాగే ఆహారంలో మార్పులు చేయండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు వంటివి ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఒంటరిగా ఉండి బాధపడకుండా అందరితో కలిసి ఉండటం అలవాటు చేసుకోండి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం అలవాటు చేసుకోండి. అందరితో కలిసి మాట్లాడుతూ సరదాగా గడపండి. దీనివల్ల మీరు ఆ డిజార్డర్ నుంచి కాస్త బయట పడతారు. అలాగే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఈ సమస్య తీవ్రం అయ్యి మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరికి విటమిన్ లోపం, మెదడు సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వస్తుంది. లైట్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్కువగా ఎండలో ఉండటం ద్వారా ఈ సమస్యను తగ్గిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.