Dowry viral video: హిందూ సాంప్రదాయంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. రెండు కుటుంబాలు ఒకటి కావడంతోపాటు.. ఇద్దరు తెలియని వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేయడానికి ముందు ఏర్పాటు చేసుకునే వేడుక ఇది. పెళ్లి అనేది వివిధ మతాల్లో రకరకాలుగా ఉంటుంది. కానీ హిందూ మతం లో పెళ్లిళ్లు మాత్రం చుట్టాలు, స్నేహితులను పిలవడం.. విందు భోజనాలను ఏర్పాటు చేయడం.. ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకొని ఆప్యాయతగా మాట్లాడుకోవడం.. వంటివి చేస్తారు. అయితే పెళ్లికి వచ్చినవారు ఊరికే తిరిగి వెళ్లకుండా పెళ్లి కట్నం ఇస్తూ ఉంటారు. ఈ కట్నం ధన రూపంలో, వస్తువు రూపంలో ఉంటుంది. అయితే ఇప్పటివరకు కట్నాలు ఇస్తే ఒక బుక్ పై రాసుకునేవారు. కానీ ఇప్పుడు ఇలా పుస్తకంలో రాయడం లేదు. కట్టాలు తీసుకోవడంలో కొత్త పద్ధతి అమల్లోకి వచ్చింది. అదేంటో తెలుసా?
పెళ్లికి వెళ్లినవారు కచ్చితంగా కట్నం రూపంలో డబ్బు ఇవ్వడం ఆనవాయితీ. వారికి తోచిన విధంగా పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె తరఫున బంధువులు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇలా డబ్బులు ఇచ్చినప్పుడు ఒక పుస్తకంలో వారి పేరు రాసుకుంటారు. ఎందుకంటే ఎవరైతే పెళ్లికట్టం ఇచ్చారు.. తిరిగి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కట్టం చెల్లించడానికి గుర్తుగా ఉండడానికి. అయితే ఇప్పుడు ఏ పని చేసినా కంప్యూటర్ ద్వారా పనిచేస్తున్నారు. అలాగే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి డిజిటల్ డివైస్లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి కుమారుడి తండ్రి తన జేబుకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తన జేబుకు ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా పెళ్లి కట్నం చదివిస్తున్నారు. అంటే ఒకప్పుడు చేతికి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీనిని బట్టి భారతదేశంలో డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు. మొన్నటి వరకు కొన్ని పెళ్లిళ్లు స్వైప్ మిషిన్స్ అందుబాటులో ఉంచేవారు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసి పెళ్లి కట్నం చదివించేవారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా సెండ్ చేస్తున్నారు. మనీ ట్రాన్స్ఫర్ విషయంలో సాంకేతికం ఎంతగా అభివృద్ధి చెందిందో దీనిని బట్టి తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా పూర్తిగా అన్ని పెళ్లిలలో ఇలాగే డిజిటల్ చెల్లింపులు ఉంటాయని కొందరు అంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పెళ్లికొడుకు తండ్రి తన జేబుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకోవడంపై కొందరు ఆసక్తిగా కామెంట్ చేస్తున్నారు. కట్టం చెల్లించేవారు పెళ్ళికొడుకు తండ్రి దగ్గరికి వచ్చి స్కాన్ చేసి చెల్లిస్తున్నారు. దీనిని కొందరు వింతగా చూస్తున్నారు.
పెళ్లిలో అక్షింతలు పట్టు.. కట్నాలు స్కానర్‌కు కొట్టు..!
ఓ పెళ్లి వేడుకలో వింత సంఘటన చోటు చేసుకుంది. మారుతున్న టెక్నాలజీని వధూవరుల తల్లిదండ్రులు అందిపుచ్చుకుంటున్నారనే ఉదాహరణగా ఈ వీడియో నిలిచింది. ఓ పెళ్లి మండపంలో వధువు తండ్రి తన జేబులో Paytm స్కానర్ పెట్టుకుని బంధుమిత్రుల నుంచి… pic.twitter.com/fWS1g9RkCq
— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025