Water Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తగినంత తాగాలి. రోజుకు 4-5 లీటర్ల నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది. మనిషి శరీరంలో 90 శాతం నీరే ఉంటుంది. నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేడ్ అవుతుంది. దీంతో పలు రకాల రోగాలకు నిలయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నీరు తాగుతూ ఉంటేనే మేలు కలుగుతుంది. మన శరీరానికి ఉత్తేజాన్నిచ్చేదిగా నీరు ఉంటుంది. పరగడుపున మంచినీరు తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలున్నాయి. నీరు తాగడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయనడంలో సందేహం లేదు.

ఉదయం నిద్ర లేచిన వెంటనే లీటరున్నర మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. తరువాత గంట ఆగి మళ్లీ నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. కడుపు మొత్తం ఖాళీ అవుతుంది. పరగడుపున నీళ్లు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రం అవుతుంది. కణజాలం వృద్ధి కావడానికి కూడా నీరే ప్రధానం అవుతుంది. అర లీటర్ నీరు తాగడం వల్ల 24 శాతం శరీరం మెటబాలిజం పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. పరగడుపున నీరు తాగడం వల్ల మలినాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో నీరే కీలకం. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒత్తిడిని జయించడంలో కూడా నీరే కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఊబకాయం సమస్య లేకుండా చేస్తుంది. శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. అందం, ఆరోగ్యం, జుట్టు కోసం కూడా నీళ్లు మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరగడుపున నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. రోగాలు రాకుండా చేయడంలో మంచినీరు పనిచేస్తుంది. నీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగితే నష్టాలే ఉంటాయి. తినేటప్పుడు తాగకూడదు. తిన్న తరువాత గంటన్నర ఆగి తాగితే మంచిది. అందుకే మంచినీరు తాగడం అందరికి విధిగా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు తాగుతూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.