Chanakya Niti Problems: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో నీతి కథలు బోధించాడు. మనిషి తన జీవితంలో చేయకూడని తప్పులను చూపిస్తూ సరైన మార్గంలో నడవాలని సూచించాడు. తన ప్రవర్తనలో ఎదుటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుచుకోవాలని చెప్పాడు. మనిషి వరివర్తన, పరిణామంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. వాటిని అధిగమించేందుకు చాణక్యుడు ఎన్నో మార్గాలు ఉపదేశించాడు. మనిషికి కష్టాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అందుకే తన ప్రయాణంలో ఒడిదుడుకులు లేకుండా చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

తన కోపమే తన శత్రువు అన్నారు. ఎప్పుడైనా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అది హద్దులు దాటితే అనర్థాలే. శత్రువులను పెంచుకున్నట్లే. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. అందుకే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు. చాణక్యుడి విధానాల ప్రకారం కోపాన్ని సాధ్యమైనంత వరకు వ్యక్తం చేయకపోవడమే మంచిది. కోపం పెరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. పరాజయం పాలైన వ్యక్తి నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. వారు చేసిన పొరపాట్లను మనం చేయకుండా ఉండాలంటే అతడి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం మంచిదే. కార్యదక్షత కలవారు ఎదుటి వారి లోపాలను తెలుసుకోవడం మనకు ప్లస్ పాయింటే.
మనకు ఎప్పుడు చేదోడు వాదోడుగా నిలిచేది కుటుంబసభ్యులే. వారితో కూడా ఎప్పుడు గొడవలు పెట్టుకోకూడదు. చీటికి మాటికి కోపానికి వస్తే వారిపై అరవకూడదు. కొన్నిసార్లు కోపం వ్యక్తం చేసి తరువాత విచారం పడుతుంటారు. ఛ నేను అలా అనాల్సింది కాదని అనుకుంటారు. ఎప్పుడు కూడా మూర్ఖులతో వాదించకూడదు. ఎందుకంటే మనం ఎడ్డెం అంటే వారు తెడ్డెం అంటారు. అందుకే వారితో వాగ్వాదానికి దిగడం అంత మంచిది కాదు. మూర్ఖులతో వాదిస్తే మన ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.

స్నేహితులతో కూడా శత్రుత్వం తెచ్చుకోవద్దు. అన్ని సమయాల్లో మనకు సాయపడేది వారే కావడంతో వారిని శాశ్వతంగా కోల్పోవడం ఇబ్బంది కలిగిస్తుంది. గురువులతో కూడా గొడవలు పెట్టుకోవద్దు. గురువులను కించపరిచేలా మాట్లాడకూడదు. వారి గురించి చెడుగా చెప్పకూడదు. విజయం సాధించిన వ్యక్తి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో చాణక్యుడు చెప్పిన సూత్రాల ప్రకారం మనిషి విజయాలు సాధించాలంటే వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.