
Campa Cola: ఇప్పుడంటే మార్కెట్లో కోకా కోలా, పెప్సికో హోల్డింగ్స్ హవా కొనసాగుతోంది కానీ.. ఒకప్పుడు అంటే 1980లో సాఫ్ట్ డ్రింక్ అంటే కంపా నే. ఈ బ్రాండ్ హవా అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు దీనినే తాగేవారు. సరళికృత ఆర్థిక విధానాలు అమలులోకి రావడంతో విదేశీ బ్రాండ్లు కోకా కోలా, పెప్సీ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఫలితంగా కంపా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్ కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టులో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి 22 కోట్లకు కంపా బ్రాండ్ ను రిలయన్స్ కొనుగోలు చేసింది..ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ విభాగంలోకి తాను ప్రవేశపెట్టినట్టు సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగా కంపా బ్రాండ్ ను టేకోవర్ చేసింది.
దేశవ్యాప్తంగా రిలయన్స్ కంపెనీకి విస్తారమైన నెట్వర్క్ ఉంది. పైగా రిలయన్స్ ఫ్రెష్ పేరుతో సూపర్ మార్కెట్లో నిర్వహిస్తోంది. దీంతో తన బ్రాండ్ ను భారీగా ప్రమోట్ చేసుకుంటున్నది. తన సూపర్ మార్కెట్ వెంచర్లలో అమ్మకాలకు పెడుతోంది. దీనివల్ల ఓపెన్ మార్కెట్లో కోకాకోలా, పెప్సీకి గట్టి పోటీ ఎదురవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయిన ఈ విదేశీ బ్రాండ్లను మించి ఎదుగుదలను నమోదు చేయాలని రిలయన్స్ భావిస్తున్నది. పైగా ఈ విభాగంలో ఏటా పదివేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండడంతో మెజారిటీ వాటా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది.

ఇక కంపా సాఫ్ట్ డ్రింక్ అమ్మకాలను 23 సంవత్సరాల క్రితమే నిలిపేశారు. 1970, 80 దశకాల్లో ప్యూర్ డ్రింక్స్, కంపా బేవరేజెస్ ఆధ్వర్యంలో వచ్చిన కంపా కూల్ డ్రింక్స్ దే దేశీయ మార్కెట్లో ఆధిపత్యం. జాతీయవాదం థీమ్ తో ” దీ గ్రేట్ ఇండియన్ టేస్ట్” అనే నినాదంతో కంపా కూల్డ్రింక్స్ భారతీయులందరికీ చేరువయ్యాయి. తిరిగి కంపా కూల్ డ్రింక్స్ నూతన అవతార్ లో అన్ని తరాల కస్టమర్లకు చేరువవుతాయని రిలయన్స్ భావిస్తోంది. ఇక కంపా రిలయన్స్ చేతిలోకి వెళ్లడంతో మార్కెట్లో గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.. అయితే కోకాకోలా, పెప్సీకి మించిన సామర్థ్యంతో రిలయన్స్ కంపా కూల్ డ్రింక్స్ ఉత్పత్తి చేస్తున్నది. భారతదేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే యూనిట్లు ప్రారంభించింది. మరోవైపు తన చైన్ లింక్డ్ సూపర్ మార్కెట్ల ద్వారా ఈ కూల్ డ్రింక్ ను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కోకాకోలా, పెప్సీ ఉత్పత్తుల విక్రయాలను తన సూపర్ మార్కెట్లలో గణనీయంగా తగ్గించే ఏర్పాట్లలో ఉంది.