
Britain: మనలో చాలామంది ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడానికి అస్సలు ఇష్టపడరు. హాయిగా మంచంపై పడుకుని చేసే ఉద్యోగం ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అయితే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అటువంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి. మంచంపై పడుకుని టీవీ చూస్తే లక్షల్లో వేతనం ఇస్తామని ఒక కంపెనీ చెబుతోంది. యూకేకు చెందిన ‘క్రాఫ్టెడ్ బెడ్’ అనే కంపెనీ ఈ బంప ఆఫర్ ను ప్రకటించింది.
బెడ్ పై పడుకుని జాబ్ చేయాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని భావించే అభ్యర్థులు కొన్ని షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ షరతులు కూడా సులువైన షరతులు కావడంతో వాటికి అంగీకరించడం కష్టమైన పని కాదు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వ్యక్తి మంచంపై పడుకుని టీవీని చూడాల్సి ఉంటుంది.
ఈ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా మన దేశ కరెన్సీ ప్రకారం ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి 25 లక్షల రూపాయల వేతనం లభించనుంది. వారానికి 37.5 గంటలు ఉద్యోగి ఈ మంచంపై పడుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగి కంపెనీకి సంబంధించిన పరుపు, దిండ్లలో చేయాల్సిన మార్పుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఇంటినుంచే పని చేయవచ్చు.
కంపెనీ ఉద్యోగి ఇంటికి పరుపుతో పాటు దిండును కూడా పంపుతుంది. ఇంటి నుంచి ఉద్యోగం చేసి ఎక్కువ మొత్తంలో సంపాదించాలని భావించే వాళ్లకు ఈ జాబ్ ఆఫర్ ద్వారా మేలు జరగనుందని చెప్పవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.