
Railway Jobs 2021: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 20 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నవంబర్ నెల 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://rites.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగ ఖాళీలలో చీఫ్ రెసిడెంట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 10 ఉండగా అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి.
Railway Jobs 2021: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హతతో పాటు అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. https://rites.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.