Madhya Pradesh: పెండ్లి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని సన్నివేశం. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమకు కాబోయే వాడికోసం ఎన్నో కలలు కంటారు. కాగా ఈ నడుమ పెండ్లిలో ఊహించని సంఘలను కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి విచిత్రమే జరిగింది. ఆ అమ్మాయి కోటి కలలతో పెండ్లికి సిద్ధం అయితే చివరకు ఊహించని మలుపు చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాణిక్వర్ ఊర్లో ఉండే అమృత్‌లాల్ కుమారుడు ప్రద్యుమ్న యాదవ్ కు అలాగే పక్క జిల్లాకు చెందినటువంటి యుమునాకు పెద్దలు పెండ్లి నిశ్చయించారు. కాగా ఆదివారం పెండ్లికి ముహూర్తం పెట్టారు. అందరూ ఆనందంతో పెడ్లి వేదిక వద్దకు వచ్చారు. అయితే వేదికమీద వరుడి ప్రవర్తన గమనించిన వధువుకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే పెండ్లి వద్దంటూ పట్టు బట్టింది.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
ఆ వరుడి మానసకి పరిస్థితి బాగోలేదని పెండ్లి కూతురుకు అర్థం అయింది. అంతే కాకుండా పెండ్లి కూతురు స్నేహితుల మీద వరుడి స్నేహితులు చేతులు వేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఈ విషయాలతో సీరియస్ అయిన వధువు తమ వాళ్లుకు చెప్పింది. దీంతో వధువు తరఫున బంధువులు రంగంలోకి దిగి వారందరినీ చితకబాదేశారు.

అయితే తమను కొట్టడం మీద ఆగ్రహంగా ఉన్నటువంటి పెండ్లి కొడుకు తండ్రి అమృత్‌లాల్ దగ్గరలో ఉన్నటువంటి మౌగంజ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాడు. అయితే పోలీసుల విచారణలో వరుడి మానసిక పరిస్థితి బాగోలేదన్న విషయం తమకు ముందు చెప్పలేదని వధువు కుటుంబీకులు ఆరోపించారు. తమను మోసం చేసి పెండ్లి వరకు తీసుకు వచ్చారంటూ రివర్స్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే గొడవ పెద్దది కాకుండా పోలీసులు సర్ది చెప్పి ఎవరి ఇంటికి వారిని పంపించారు.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?