https://oktelugu.com/

RGV Comments on pawan kalyan speech : ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్

RGV Comments on pawan kalyan speech : వివాదాలు లేనిదే పూటగడవని రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి రాజేస్తూనే ఉంటాడు. అలా చేయకపోతే ఆయన తిన్న భోజనం కూడా అరుగుతుందో లేదో తెలియదు. నిన్నటి నుంచి మేనియాలా పట్టుకున్న ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అందులో పాల్గొన్న పవన్, కేటీఆర్ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి చర్చించుకుంటున్నారు. భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2022 / 12:35 PM IST
    Follow us on

    RGV Comments on pawan kalyan speech : వివాదాలు లేనిదే పూటగడవని రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి రాజేస్తూనే ఉంటాడు. అలా చేయకపోతే ఆయన తిన్న భోజనం కూడా అరుగుతుందో లేదో తెలియదు. నిన్నటి నుంచి మేనియాలా పట్టుకున్న ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అందులో పాల్గొన్న పవన్, కేటీఆర్ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి చర్చించుకుంటున్నారు.

    RGV

    భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తప్పని ఒక యుద్ధమే ఈ సినిమా’ అని పవన్ నర్మగర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగుతోంది.

    Also Read:  క్రేజీ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో

    ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగంపై తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంతో హుందాగా , అద్భుతంగా సాగిందని.. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉందన్నారు. అందుకే ఆయన్ని స్టార్స్ అందరిలోకెల్లా పవర్ ఫుల్ అనేది’ అని వర్మ ట్వీట్ చేశారు.

    RGV Comments On Pawan

    అనంతరం మరో ట్వీట్ ను కూడా వర్మ చేశాడు. ‘ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగాల్లో ఇదే దిబెస్ట్. ఎంతో భావోద్వేగంగా.. హృదయపూర్వకంగా.. వినయంగా ఉంది’ అని రాసుకొచ్చాడు.

    ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ చేసే వర్మ.. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. వర్మలోనూ మార్పు వచ్చిందని.. మార్పు మంచిదే అంటూ కామెంట్ చేస్తున్నారు.

    Tags