Breast Cancer: రొమ్ము క్యాన్సర్ సమస్యల బారిన పడుతున్నారా.. అయితే మహిళలు ఈ తప్పులు అసలు చేయవద్దు!

రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన నెలను ప్రతి ఏడాది అక్టోబర్‌‌లో జరుపుకుంటారు. చాలామంది మహిళలు వారు చేసే కొన్ని తప్పుల వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మహిళలు చేసే ఆ చిన్న తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 13, 2024 10:18 pm

breast cancer

Follow us on

Breast Cancer: ప్రస్తుతం చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. పెళ్లయిన మహిళలే కాకుండా పెళ్లి కాని, యంగ్ ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు కూడా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దేశంలో రోజురోజుకీ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ప్రతీ ఏడాది దేశంలో సుమారుగా 162468 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన మహిళలు తొందరగా గుర్తిస్తే 90 శాతం వరకు మహిళలు బయట పడవచ్చట. అయితే రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన నెలను ప్రతి ఏడాది అక్టోబర్‌‌లో జరుపుకుంటారు. చాలామంది మహిళలు వారు చేసే కొన్ని తప్పుల వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మహిళలు చేసే ఆ చిన్న తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

కొన్ని వ్యాధులు వంశంపారంపర్యంగా వస్తాయి. అందులో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే అవివాహిత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 శాతం నుంచి 28 శాతం ఉంటుంది. దీనికి ముఖ్య కారణం బిడ్డకు జన్మనివ్వకపోవడం, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వల్ల అవివాహిత మహిళలు క్యాన్సర్ బారిన పడతారట. ఎందుకంటే గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు, తల్లిపాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరు యువతులు పెళ్లి చేసుకోకపోవడం వల్ల అవివాహితులు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు మహిళలు హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీలు చేయించుకోవడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ థెరపీలో హార్మోన్లను కృత్రిమంగా ఇస్తారు. వీటివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గర్భం రాకూడదని కొందరు మహళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఎక్కువగా వీటిని వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవనశైలిలోని మార్పుల వల్ల కూడా మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పొగ తాగడం, మద్యం సేవించడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం వంటి వాటివల్ల ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు. కాబట్టి ఆరోగ్యమైన, పోషకాలు ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాధిని మామోగ్రఫీ ద్వారా తెలుసుకుంటారు. 30 ఏళ్లు దాటిన ప్రతీ మహిళ ఈ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రొమ్ముల్లో ఏ మాత్రం చిన్న కణితిలా అనిపించిన వైద్యుని సంప్రదించి ఈ పరీక్ష తప్పకుండా చేసుకోవాలి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.