Breakup Recovery Tips: చాలామంది జీవితంలో జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇందుకోసం పెద్దల కుదిర్చిన వివాహం కంటే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటారు. ప్రేమ అనేది ఎప్పుడో ఒకచోట పుడుతుంది. అయితే నేటి ప్రేమ పెళ్లిళ్లు చాలా వరకు చివరి వరకు ఉండడం లేదు. ఎంత ఇష్టం కొద్ది ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే కష్టంగా దూరమై విడివిడిగా ఉంటున్నారు. ప్రేమికులు విడిపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో ఒకరి భావాలు ఒకరు నచ్చకపోవడం.. లేదా ఏవో ప్రాబ్లమ్స్ వంటివి ఉంటాయి. కారణాలు ఏదైనా ప్రేమికులు విడిపోయిన తర్వాత విడివిడిగా ఉన్నా.. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆలోచించడం వల్ల ఇరువురి జీవితాలు నాశనం అవుతాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
Also Read: పెళ్లాంపిల్లలున్నా.. ఓ యువతితో సహజీవనం.. నిత్యం ఫోన్ మాట్లాడుతోందని ఏం చేశాడంటే?
కొన్నాళ్లపాటు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్న వాళ్ళు ఆ తర్వాత విడివిడిగా ఉంటే వారి మనసు ఎంతో బాధతో ఉంటుంది. అయితే వీరిలో కొందరు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పాత విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరో ఒకరు ఇగోని వీడి ఎదుటివారిని కలిసేందుకు ప్రయత్నించాలని అనుకుంటే.. అలా ఆలోచించినా ఫలితం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం లేనప్పుడు వారి గురించి ఆలోచించడం వ్యర్థమే అవుతుంది. అలాంటప్పుడు పాత విషయాలను అన్ని మరిచిపోయి కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. లేకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల ముఖ్యంగా కెరియర్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ పై చదువులు చదివేవారైతే వారి మనసుపై ప్రభావం పడి ముందుకు వెళ్లలేరు. ఉద్యోగం చేసేవారు అయితే కార్యాలయాల్లో నిత్యం కృంగిపోతూ ఉంటారు. వారి గురించి ఆలోచిస్తే పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. ఈ జ్ఞాపకాలను మర్చిపోవడానికి కొత్త అలవాట్లు చేసుకోవాలి. అంటే యోగా చేయడం లేదా కొత్త స్నేహితులతో సరదాగా ఉండడం.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల గత జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఉంటాయి.
Also Read: ఒక రాత్రి, ఒక రోజు కోసం రిలేషనా? ఇదేం ట్రెండ్ రా స్వామీ..
అయితే ఒక ప్రాంతంలో విడిపోయిన వ్యక్తి పదేపదే తారసపడుతూ ఉంటే.. పాత విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇలాంటి అప్పుడు ఆ ప్రాంతాన్ని వేడి కొన్ని రోజులపాటు ఇతర ప్రాంతానికి వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా వారికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్.. లేదా వారి స్నేహితులను కలవకుండా ఉండడమే మంచిది. లేకుంటే నిత్యం వారి గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు ఆందోళనగా మారి.. ఆ తర్వాత గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది యువత తీవ్రంగా ఆలోచిస్తూ గుండెపోటుకు గురైన సంఘటనలు ఉన్నాయి.
ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే ముందే ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలి. లేకుంటే పెద్దలు కుదిరించిన వివాహాన్ని చేసుకుని జీవితానికి ఒక మార్గం వేసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ పెళ్లి అనేది ఒక భాగం మాత్రమే. మిగతా మొత్తం కెరీర్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకుంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది.