Shane Warne: స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ దిగ్గజం శనివారం నాడు సడన్ గా గుండెపోటుతో మరణించిన వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం విదితమే. కేవలం ఆస్ట్రేలియాలోనే కాకుండా క్రికెట్ ప్రపంచంలో అతనికి అనేక దేశాల్లో అభిమానులు ఉన్నారు. బంతితో మాయచేసి అభిమానులను గెలుచుకున్న వార్నర్ మృతిని ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్ గా ఉండే వార్నర్ ఇలా గుండె పోటుకు గురవడం ఏంటని అందరూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.

అయితే ఇప్పుడు వారి అనుమానాలకు బలం చేకూరుస్తూ థాయిలాండ్ పోలీసులు చెప్పిన కొన్ని విషయాలు సంచలనం రేపుతున్నాయి. హాలిడే రోజుల్లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దామని వార్నర్ థాయిలాండ్ కి వెళ్ళాడు. అయితే వార్నర్ చనిపోయిన రూమ్ లో ఫ్లోర్ మీద అలాగే టవల్ మీద కొన్ని రక్తపు మరకలు గుర్తించినట్లు థాయిలాండ్ పోలీసులు వెల్లడించారు. దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి బ్లడ్ ఎలా వచ్చిందంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.
కానీ ఇదే పోలీసులు మొదట ప్రాథమిక విచారణలో వార్నర్ కు సడన్ గా గుండెపోటు వస్తే అతని ముగ్గురు స్నేహితులు అతనికి సిపిఆర్ ఇచ్చి బ్రతికించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టీం వచ్చి మళ్ళీ సిపిఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నం చేసి చివరకు ఆస్పత్రికి తరలించింది అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఐసీయూలో అతనికి డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ వార్నర్ ప్రాణాలు నిలపలేక పోయారని వెల్లడయింది.

మరి ఇప్పుడు రూమ్ లో ఉన్న రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. ఒకవేళ గుండెపోటు వచ్చినప్పుడు సడెన్ గా కింద పడి పోవడం వల్ల ఏమైనా గాయమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లేక ఇంకేదైనా కారణం వల్ల షైన్ వార్నర్ చనిపోయే ఉంటాడా అనే అనుమానంలో కూడా విచారిస్తున్నారు థాయిలాండ్ పోలీసులు. నిన్న పోలీసులు ఈ విషయం చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతమైన చర్చ సాగుతోంది. ఏదిఏమైనప్పటికీ స్పిన్ దిగ్గజం ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు అనే బాధలోంచి క్రికెట్ అభిమానులు ఇంకా తేరుకోలేక పోతున్నారు.