https://oktelugu.com/

Birds : పక్షులు ‘V’ ఆకారంలో ఎందుకు వెళ్తాయి? దీనికి అర్థం ఏంటి?

పక్షులు ఐకమత్యంగా ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తాయి. అయితే ‘V’ ఆకారరంలో పక్షులు వెళ్లడం ద్వారా..

Written By:
  • Srinivas
  • , Updated On : January 28, 2024 / 04:22 PM IST

    birds journy V shape

    Follow us on

    Birds : మనుషులతో పాటు పక్షులు జీవులే. అయితే వాటి జీవన విధానం వేరు. కొన్ని రకాల పక్షులు ఎక్కువగా భూమి పై సంచరిస్తూ ఉంటాయి. మరికొన్ని అడవిలో జీవిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు మాత్రం దూర ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇలా దూర ప్రాంతాలకు వెళ్లే పక్షులు కొన్ని రోజుల పాటు ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఇలా వెళ్లేవి గుంపుగుంపులుగా వెళ్తాయి. ఇలాంటి సమయంలో అవి ‘V’ ఆకారంలో వెళ్తాయి. పక్షులు ఈ ఆకారంలో వెళ్తూ ఉండడాన్నా చాలాసార్లు గమనించే ఉంటాం. కానీ అవి అలా ఎందుకు వెళ్తాయోననే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. పక్షులు అలా వెళ్లడానికి ఓ కారణం ఉంది.

    కొన్ని రకాల పక్షులు ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాయి. మరికొన్ని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు వెళ్తూ ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తాయి. ఒకటికి మరొకటి సాయం చేస్తూ ముందుకు వెళ్తాయి. అయితే ఇవి ‘V’ ఆకారంలో వెళ్లడానికి కారణమేంటి? అని అనుకుంటున్నారు. అయితే ఇవి అలా వెళ్లడానికి బలమైన కారణం ఉంది.

    పక్షులు ఐకమత్యంగా ఉంటాయి. ఇవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తాయి. అయితే ‘V’ ఆకారరంలో పక్షులు వెళ్లడం ద్వారా అవి గాలి పీడనం నుంచి తట్టుకోగలుగుతాయి. అలాగే ఒక పక్షి తరువాత మరో పక్షి క్రాస్ లో ఉంటుంది. దీంతో వెనుక ఉన్న పక్షులపై పెద్దగా గాలి పీడనం పడదు. దీంతో ఎలాంటి అలసట లేకుండా ముందుకు వెళ్తాయి. అయితే ముందున్న పక్షి అలసిపోతే మాత్రం ఆ పక్షి వెనకకు వచ్చి వెనక ఉన్న పక్షి ముందుకు వెళ్లి దారి చూపిస్తుంది.

    ఇలా అన్ని పక్షులు కలిసి గమ్య స్థానానికి చేరుతాయి. అలా వలస వెళ్లిన పక్షులు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత మరో ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. ఇలా దేశాలు వలస వెళ్లే పక్షులు మాత్రమే ‘V’ ఆకారంలో వెళ్తాయి. కొన్ని పక్షులు గుంపులుగా వెళ్తాయి. ఎందుకంటే ఎదురుగా వచ్చే ఇతర పక్షుల నుంచి రక్షణ కోసం ఇవి కలిసి కట్టుగా వెళ్తాయి. ఏది ఏమైనా పక్షుల్లో ఐకమత్యం ఉంటుంది. అందువల్లే ఇలా ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తాయి.