Homeలైఫ్ స్టైల్Bhasha Sangam: ఈ యాప్ తో దేశంలోని అన్ని భాషలు సులువుగా నేర్చుకోవచ్చు.. ఎలా అంటే?

Bhasha Sangam: ఈ యాప్ తో దేశంలోని అన్ని భాషలు సులువుగా నేర్చుకోవచ్చు.. ఎలా అంటే?

Bhasha Sangam: దేశంలోని విద్యార్థులలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసినా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉండవని చెప్పాలి. ప్రభుత్వం విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని పెంచాలనే ఆలోచనతో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కింద భాషా సంగం అనే యాప్ ను రూపొందించింది.

ఈ యాప్ ను ఉచితంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో మొత్తం 22 భాషలు ఉండగా ఈ భాషలను సులభంగా ఈ యాప్ సహాయంతో నేర్చుకోవచ్చు. యాప్ లో గేమ్స్ ఆడటం ద్వారా భాషలను నేర్చుకునే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. ఈ భాషలలో తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మైథిలి, డోగ్రీ, ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చు.

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఈ యాప్ ను రూపొందించడం గమనార్హం. ఈ యాప్ ద్వారా వివిధ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించిన సమాచారంను కూడా తెలుసుకోవచ్చు. గేమ్ లాగా రూపొందించిన ఈ యాప్ లో సులభంగా ఈ లెసన్ యాప్ పై విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. భాషా అభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు, సమాధానాల ప్రాతిపదికన ఈ యాప్ ను రూపొందించారని సమాచారం.

44 ప్రత్యేక పాత్రల ద్వారా దేశంలోని విభిన్న సంస్కృతిని ఈ యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా ఈ యాప్ ను రూపొందించారు. భాషలో సాధించిన స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ ను పొందవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper