Virata Parvam Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. నక్సల్ నేపథ్యంలో కామ్రేజ్ రవన్నజీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉండగా… కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ఈ మూవీని కూడా త్వరలోనే ప్రేక్ష్హకుల ముందుకు తీసుకు రానున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ యూనిట్ ప్రకటించింది. `ది వాయిస్ ఆఫ్ రవన్న` పేరుతో సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రేపు ఉదయం 10.10 గంటలకు ఈ సర్ ప్రైజ్‌ని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 14 రానా పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు దర్శకుడు వేణు ఉడుగుల టీమ్ రెడీ అయ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, `కోలు కోలు`పాట ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయబోతున్నారు చిత్ర బృందం. అలానే సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాని థియేటర్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Rise to 'The Voice Of Ravanna' from #VirataParvam Tomorrow at 10:10 AM 🔥#HappyBirthdayRanaDaggubati @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @nanditadas @Naveenc212 @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/cKT3eE0Ow9
— v e n u u d u g u l a (@venuudugulafilm) December 13, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: New update fron rana and sai pallavi virata parvam movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com