Weight Loss: మారుతున్న కాలంతో పాటే ఊబకాయంతో బాధ పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల కూడా చాలామంది బరువు పెరుగుతుండటం గమనార్హం. ఊబకాయులు వేర్వేరు పద్ధతుల ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బరువు తగ్గడానికి డైటింగ్ పై ఆధారపడితే మరి కొందరు జిమ్ కు వెళ్లడం లేదా ఇతర మార్గాల ద్వారా బరువు తగ్గాలని అనుకుంటున్నారు.

అయితే వైద్య నిపుణులు మాత్రం కఠినమైన డైట్ ప్లాన్ అవసరం లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఊబకాయులు సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పప్పు, మొలకలు, బీన్స్, లైట్ ట్యూనా చికెన్ బ్రెస్ట్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గాలని భావించే వాళ్లు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలని భావించే వాళ్లు చిరుతిండ్లను వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు గ్రీన్ టీ, హెర్బల్ టీ తాగితే మంచిదని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే పొట్ట నిండుగా ఉండటంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు చేరుతాయి. ఆహారంలో సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గవచ్చు.