SSC Recruitment 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ నెల 28వ తేదీలోగా దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

గడువులోగా ఫీజు చెల్లించడం సాధ్యం కాని పక్షంలో నవంబర్ 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం బ్యాంక్ చలానా ద్వారా ఫీజును చెల్లించవచ్చు. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత పరీక్షలకు సంబంధించిన తేదీలను విడుదల చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ఇంజినీర్, కెమికల్ అసిస్టెంట్, మెడికల్ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, టెక్స్ టైల్ డిజైనర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పరీక్షా సమయం గంట కాగా అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 0.50 నెగిటివ్ మార్కులు ఉంటాయి.
పరీక్ష పాసైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం.