Best Smartphones: కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీ పెరుగుతుంటే ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లలో వివిధ సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండటంతో వాటి ధరలు పైపైకి చేరుతున్నాయి. అయితే సామాన్యులు అంత ధరలను తట్టుకోలేరు. రూ.10వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలని భావించే వారికి కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఏ03: ఈ మోడల్ మార్కెట్‌లో తక్కువ ధరకు లభిస్తోంది. అయినా ఈ ఫోన్ మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 48 మెగా పిక్సల్ రేర్ కెమెరా, డెప్త్ సెన్సార్‌తో 2 మెగా పిక్సల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆక్టా కోర్ 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వర్క్ అవుతుంది. ఈ ఫోన్ ధర రూ.7,999

రియల్‌మీ నార్జో 50ఐ: ఈ ఫోన్ ఆక్టా కోర్ యూనిసాక్ 9863 ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. 6.5 అంగుళాల ఎల్‌సీడీ మల్టీ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8 మెగా పిక్సర్ రేర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.7.499. ఒకవేళ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకుంటే రూ.8,999 చెల్లించాల్సి ఉంటుంది.

జియో నెక్ట్స్: గూగుల్‌తో కలిసి జియో సంస్థ ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,499. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 13 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా దీని ఫీచర్లు. స్నాప్ డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. మెమొరీ కార్డు సహాయంతో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
Also Read: Prabhas Maruthi Movie: అందుకే అతనితో ఒప్పుకున్నా.. ప్రభాస్ ఫుల్ క్లారిటీ !

రెడ్‌మీ 9: 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు రెడ్‌మీ 9 ప్రత్యేకతలు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ 35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.8,999గా ఉంది. వీటితో పాటు టెక్నో స్పార్క్ 8 ప్రో (రూ.9,999), పోకో సీ 31 (రూ.8,499) వంటి స్మార్ట్ ఫోన్‌లు కూడా మార్కెట్‌లో రూ.10వేల లోపు ధరలకు లభిస్తున్నాయి.

Recommended Videos