spot_img
Homeలైఫ్ స్టైల్Electricity Bill Payment: ఫోన్ పే, గూగుల్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా..? అయితే...

Electricity Bill Payment: ఫోన్ పే, గూగుల్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా..? అయితే బెస్ట్ ఆప్షన్ ఇదే..

Electricity Bill Payment: ప్రస్తుతం చాలామంది బిల్లులను ఆన్లైన్ లోనే చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో అవసరమయ్యే సరుకుల నుంచి విద్యుత్ బిల్లుల వరకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ఇటీవల కొందరు వినియోగదారులు చెబుతున్న ప్రకారం.. Phone Pay, Google Pay, Amazon Pay ద్వారా బిల్లులు బిల్లులు చెల్లించాలనుకుంటే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు Bill fetch failed, Billar down, Service Temporary Unavailable అనే మెసేజ్ చూపిస్తోంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లు గడువు తేది దగ్గర ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయంగా మరో ఆప్షన్ ఉంది. దీని ద్వారా విద్యుత్ బిల్లును ఈజీగా చెల్లించవచ్చు. అది ఎలాగంటే?

సాధారణంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి మనీ ట్రాన్స్ఫర్ సంస్థలు విద్యుత్ పంపిణీ సర్వర్లతో కనెక్ట్ కావడంతో బిల్లులు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో టెక్నికల్ మెయింటెనెన్స్ లేకపోవడం.. కనెక్షన్ లోపం, డేటా సింక్ కాకపోవడంతో బిల్ జనరేట్ కాకపోవచ్చు. ముఖ్యంగా నెల ప్రారంభం లేదా నెల చివరి తేదీల్లో వినియోగదారుల చెల్లింపులు విపరీతంగా చేయడం వల్ల సర్వర్ పై ఒత్తిడి పెరిగి అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బిల్లు చెల్లించడానికి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఒక్కోసారి సర్వర్ బిజీగా ఉండి సమస్యలు ఉంటే కాసేపటి తర్వాత తిరిగి ప్రయత్నించాలి. లేదా వేరే యాప్ లో ప్రయత్నించాలి.

Also Read: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?

అయినా కూడా బిల్లు చెల్లించడానికి అవకాశం రాకపోతే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారిక యాప్ ద్వారా చెల్లించాలి. తెలంగాణలో వినియోగదారులు తమ ప్రాంతానికి చెందిన డిస్కం యాప్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉత్తర తెలంగాణకు సంబంధించిన వారు Northern Power distribution company of Telangana limited (TGNPDCL).. సౌత్ తెలంగాణకు సంబంధించిన వారు avtaran Power distribution company of Telangana limited (TGSPDCL) ద్వారా చెల్లించవచ్చు. వీటికి సంబంధించిన అధికారిక యాప్ ఓపెన్ చేయాలి. అందులో సర్వీస్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఇక్కడ బిల్ వివరాలను చూసి డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా వెళ్ళు చెల్లించవచ్చు. బిల్లు చెల్లించిన వెంటనే రసీదు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ అధికారిక యాప్ లో సర్వీస్ నెంబర్ కు బదులు కన్జ్యూమర్ నెంబర్ కూడా ఎంట్రీ చేసి బిల్లు చెల్లించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular