సీనియర్ సిటిజన్లలో చాలామంది నెలవారీ ఆదాయం ఇచ్చే పథకాలను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ రిస్క్ ఉన్న పథకాలను ఎంచుకోవడం ద్వారా సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసాను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 20 రూపాయలతో పోస్టాఫీస్ అకౌంట్ ను మొదలుపెట్టవచ్చు. చెక్కు సదుపాయం కావాలనుకుంటే మాత్రం కనీసం 500 రూపాయలు ఖాతాలో ఉంచాలి.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 6.9 శాతం వడ్డీ లభిస్తుండగా ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంది. గరిష్ట పరిమితి లేకుండా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ముందుగా నిర్ణయించిన సమయానికి నగదును డిపాజిట్ చేయవచ్చు. కనీసం 200 రూపాయలతో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది.
ఏడాదికి ఒకసారి వడ్డీ చెల్లింపు జరగనుండగా ఏడాది మొదలుకొని 5 సంవత్సరాల వరకు డిపాజిట్లు ఉన్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు. త్రైమాసిక వడ్డీ లెక్కింపుతో ఈ స్కీమ్ అమలు జరుగుతుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ట్ చేసినా 118 నెలల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుంది. కనీసం 1000 రూపాయలతో ఈ స్కీమ్ లో చేరవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.