Homeలైఫ్ స్టైల్Health Benefits: బట్టతలపై జుట్టుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. గచ్చకాయ గింజలతో?

Health Benefits: బట్టతలపై జుట్టుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. గచ్చకాయ గింజలతో?

ఈ తరం వాళ్లకు గచ్చకాయలు పెద్దగా పరిచయం లేకపోయినా మన పెద్దవాళ్లకు గచ్చకాయల గురించి గచ్చకాయల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి బాగా తెలుసు. అటవీ ప్రాంతాలలో గచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది బట్టతల సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. గచ్చకాయల వల్ల బట్టతలపై జుట్టుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
Health Benefits

ఆయుర్వేద వైద్యంలో సైతం గచ్చకాయ గింజలు, కాయలు, ఆకులు, బెరడును వినియోగిస్తారు. కఫాన్ని, వాతాన్ని నివారించడంలో గచ్చకాయ గింజలు సహాయపడతాయి. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టడంలో రక్త దోషాలు, వాపు దోషాలు తొలగిపోతాయి. గచ్చకాయ గింజలు రక్తవృద్ధికి తోడ్పడటంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి. మధుమేహం తగ్గడంలో గచ్చకాయ గింజలు ఉపయోగపడతాయి.

కీళ్ల నొప్పులు తగ్గడానికి, పైల్స్ నివారణకు, కిడ్నీలో రాళ్లు తగ్గడానికి, వాంతులు తగ్గడానికి గచ్చకాయ గింజలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. గచ్చకాయ పూల నీటిని 15 రోజులు తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గచ్చకాయ గింజలను నూరి పొట్టపై రాస్తే జ్వరం తగ్గుతుంది. రుతుక్రమం సమస్యలతో బాధ పడే మహిళలు గచ్చకాయల పొడిలో మిరియాలు కలిపి తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.

గచ్చకాయ పుల్లలతో పళ్లు రుద్దుకుంటే దంత సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గచ్చ ఆకులను, వేప ఆకులను ముద్దగా నూరి దురద ఉన్నచోట రాస్తే తామర, గజ్జి సమస్యలు దూరమవుతాయి. గచ్చ ఆకులను ఆముదంలో వేయించి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి ఉన్నచోట కట్టు కడితే ఆ సమస్యలు దూరమవుతాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version