Sleep Astrology: జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని అనుకునేవారు.. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించాలని అనుకునేవారు.. లక్ష్మీ కటాక్షం కలగాలని అనుకునేవారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. అలాగే వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క చిన్న పని చేయడం వల్ల ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. అలాగే లక్ష్మి ఇంట్లోనే ఉండి ధనం ఇంట్లోకి వచ్చేలా ఆశీర్వదిస్తుంది. అయితే నిద్రపోయేముందు ఏం చేయాలి?
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల పనులతో ఉద్యోగులు, వ్యాపారులు బిజీ వాతావరణం లో గడుపుతూ ఉంటారు. సాయంత్రం టీవీ చూస్తూ లేదా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసిన తర్వాత నిద్రిస్తారు. అయితే నిద్రించే టీవీ చూడడం లేదా మొబైల్ తో కాలక్షేపం చేయడం ఈమధ్య ఎక్కువగా అయింది. కొందరు పురుషులు అయితే మద్యం సేవించి ఆ తర్వాత భోజనం చేసి నిద్రించడం జరుగుతుంది. ఇలా రోజు నిద్రించే ముందు సాధారణ జీవితం గడపడం వల్ల ఇంట్లో ఎదుగుదల కనిపించదు. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోగొట్టడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే పూజలు, వ్రతాల కన్నా ప్రతిరోజు రాత్రి ఇలా చేయాలి.
ప్రతిరోజు నిద్రించే ముందు ఒక కర్పూరంను వెలిగించాలి. ఆ కర్పూరంతో ఇంట్లో ఉన్న గదులన్నీ తిరగాలి. ఈ కర్పూరం ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. ఒక ఇంటికి శుక్రుడి అనుగ్రహం ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగా.. సంపదతో వర్ధిల్లుతుంది. అలాగే కొందరి ఇంట్లో ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు సాగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఇలాంటివారు సైతం కర్పూరాన్ని వెలిగించి గదులన్నీ తిప్పడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉంటారు.
ప్రతిరోజు పూజ చేసే సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తారు. అయితే ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజ చేయని వారు ఉంటారు. ఇలాంటివారు రాత్రి నిద్రించే సమయంలో కర్పూరాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో సంపద వర్ధిల్లుతుంది. అనుకోకుండా అదృష్టం కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది. అయితే మహిళలు కర్పూరాన్ని వెలిగించి గదిలో తిప్పడం వల్ల సరైన ఫలితం ఉండే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఐశ్వర్య దేవతను ఆశీర్వదించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.