Bedroom Vastu: ప్రతి ఇంటిలో పడకగది చాలా ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే రోజంతా అలసిపోయిన తర్వాత పడకగదిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. హాయిగా నిద్ర పోవడానికి పడకగది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మంచి నిద్ర కోసం పడకగదని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ గది ఆశుభ్రంగా ఉంటే మనసు ఆందోళనగా ఉంటుంది. ఫలితంగా సరైన నిద్ర పట్టదు. అంతేకాకుండా పడకగదని అందంగా తీర్చిదిద్దడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అయితే పడకగదిలో చేయకూడని మరో పని ఒకటి ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
Also Read: కబడ్డీ కథ తెలుసా మీకు?
చాలామంది పడకగదిలోనే బీరువాలను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే దుస్తులకు సంబంధించిన వస్తువులను కూడా బెడ్ రూమ్ లోనే ఉంటాయి. స్నానం చేసేముందు విడిచిన బట్టలను.. స్నానం చేసిన తర్వాత తడి బట్టలను బెడ్ పై వేస్తూ ఉంటారు. వీటిని ఆడవాళ్లు ఎంత సర్దుకున్నా మగవాళ్ళు మాత్రం అలాగే నిర్లక్ష్యంగా వేస్తారు. కానీ ఇలా వేయడం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుపుతున్నారు.
విడిచిన బట్టలు లేదా తడి బట్టలు బెడ్ పై వేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి దుస్తుల్లో ఎక్కువగా క్రిములు ఉంటాయి. ఈ క్రిములు పైకి వెళ్లి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బెడ్ పై తల ఆ నుంచి పడుకుంటాము. ఈ క్రమంలో క్రిములు నేరుగా తలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల బెడ్ పై ఇలాంటి దుస్తులు వేసేముందు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇంట్లో బెడ్ పై ఇలా వేయిస్తే వారికి వెంటనే తీసేయమని చెప్పాలి. లేదా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండమని పేర్కొనాలి.
అలా వీలుకాని సమయంలో స్త్రీలు అయినా పడకగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. పడకగది శుభ్రంగా ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా పడకగదిలోనే నిద్రిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎక్కువసేపు పడకగదిలోనే పడుకొని ఉంటాం. దీంతో పడకగదిపై ఉండే దుమ్ము ధూళి నేరుగా తలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఎక్కువ సార్లు పడకగదిని శుభ్రం చేసుకుని అవకాశం లేనప్పుడు ఈ గదిలో ప్రత్యేకంగా సువాసన వెదజల్లే ఏర్పాటు చేసుకోవాలి. లేదా కనీసం వారం రోజులు లేదా నెల రోజులకు ఒకసారి ఈ గదిని శుభ్రం చేస్తూ ఉండాలి. అయితే ప్రతిరోజు గది నేలను శుభ్రం చేస్తూ కనీసం వారం రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన అయినా కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దుస్తులకు సంబంధించిన బీరువాను లేదా కొన్ని దుస్తులను వేరే గదిలోకి మార్చుకోవాలి. ప్రతిసారి పడకగదికి రాకుండా తక్కువసార్లు పడకగదికి రావడం వల్ల ఇక్కడ ఎక్కువగా వాతావరణం కలుషితం అయ్యే అవకాశం ఉండదు. అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా పడకగదిలోకి రాకుండా శుభ్రంగా అయిన తర్వాతనే ఇక్కడికి రావాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు.
Also Read: భోజనం చేసిన వెంటనే కునుకు వస్తుందా? ఈ సమస్యను తెచ్చుకున్నట్లే..