Mobile Tips: నేటి కాలంలో ప్రతి ఒక్క అవసరానికి మొబైల్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ తో పాటు కొన్ని పనులను కూడా ఫోన్ చేస్తుండడంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మొబైల్ ను కలిగి ఉంటున్నారు. అయితే చాలా మంది గాడ్జెట్ ను యూజ్ చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో పర్సనల్ డేటా లీక్ అయి ఆర్థికంగా నష్టపోతారు. వివిధ కారణాలతో ఇప్పటికే చాలా మంది మొబైల్ ద్వారా నష్టపోయిన వారు ఉన్నారు. అయితే ఫోన్ లో కాకుండా సరదాగా ఇతరులతో మాట్లాడినా.. ఫోన్ వింటుందన్న విషయం చాలా మందికి తెలియదు. మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో.. అందుకు సంబంధించిన డేటా ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురుకావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మనుషుల మాటలను మొబైల్ ఎలా వింటుంది? దానిని అవైడ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
నిన్నటి వరకు ఇతరులతో ఫోన్లో మాట్లాడిన మాటలు హ్యాకర్స్ వినే అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్నాం.. లేదా ఇంటర్నెట్ లో డేటా ద్వారా కొందరు హ్యాక్ చేసిన సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేయకపోయినా.. ఎవరితో ఫోన్లో మాట్లాడకపోయినా మన వాయిస్ రికార్డు అవుతుంది. మనం ఏం మాట్లాడామో ఫోన్ విని అందుకు సంబంధించిన డేటాను మన ముందు ఉంచుతుంది. అయితే ఇలా కావడానికి మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. దానిని గుర్తించి సెట్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోరు.
వివిధ అవసరాల కోసం మొబైల్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా యాప్ ను డౌన్లో డ్ చేసుకునే సమయంలో పలు రకాల పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ను Allow అని క్లిక్ చేస్తేనే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ సమయంలో Microphone Permission కూడా అడుగుతుంది. ఈ సందర్భంగా దానిని Allow చేయడం వల్ల మైక్రోఫోన్ ద్వారా మన వాయిస్ రికార్డ్ అవుతుంది. దీంతో మాట్లాడిన మాటల ద్వారా ఫోన్లో దానికి సంబంధించిన డేటా ప్రత్యక్షమవుతుంది.
ఉదాహరణకు ఒక బెడ్ మంచం కొనుగోలు చేయాలని అనుకుంటే.. దానికి సంబంధించి ధరలు, క్వాలిటి గురించి ఇతరులతో చర్చించినప్పుడు కొన్ని యాప్స్ అంటే ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్, క్రోమ్ వంటి యాప్స్ వింటాయి. ఈ వాయిస్ రికార్డు చేసుకొని దానికి సంబంధించిన డేటాను క్రోమ్ ఓపెన్ చేయగానే చూడొచ్చు. అయితే ఇలా మైక్రోఫోన్ ఆన్ లో ఉంటే ఫోన్ హ్యాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దానిని ఆఫ్ చేసుకోవచ్చు. మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పర్మిషన్ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఇప్పుడు దానిని ప్రెష్ చేయగానే ఇన్ స్ట్రాగ్రామం, వాట్సాప్ తదితర యాప్స్ కు సంబంధించిన మైక్రోఫోన్ డినే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. దీంతో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోరు.