Zodiac Signs: వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాలం పూర్తయిన తర్వాత స్థానం మార్చుకుంటూ ఉంటాయి. ప్రతి గ్రహం ఆరు నెలల పాటు ఒక రాశిలో ప్రయాణించి ఆ తర్వాత మరో రాశిలోకి మారుతూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రభావం పడి ఆ రాశులు కలిగిన వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కో సమయంలో కొన్ని గ్రహాలు ఒకే వరుసలో ఏర్పడినప్పుడు ఆయా రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే శని స్థానం అయినా కుంభరాశిలోకి కొన్ని గ్రహాలు ప్రవేశం చేయడం వల్ల మిగతా రాశుల్లో అనూహ్య మార్పులు ఉంటాయి. ఫిబ్రవరి 27 నుంచి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు. ఇప్పటినుంచి చంద్రుడు శని కలిసి ప్రయాణం చేయడం వల్ల కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం..
చంద్రుడు శని కలిసి కుంభరాశిలో ప్రయాణించడం వల్ల కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాదనలకు తగాదాలకు దూరంగా ఉండటమే మంచిది. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడితే వారితో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపకుండా ఉండాలి. ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం మంచిది.. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాల్సి వస్తే తోటి వారిపై కన్నేసి ఉంచాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లొద్దు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మానుకోవడమే మంచిది.
కన్యారాశి వారిపై చంద్ర శని గ్రహాల కలయిక ప్రభావం పడుతుంది. మీ రాశి వారికి పట్టాపరమైన చిక్కులు ఎదురవుతాయి. వీరు ప్రయాణాలను ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండాలి. వ్యాపారవేత్తలు అనవసరమైన అప్పులు చేయకుండా ఉండాలి. ఉద్యోగులు ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెంటనే మానుకోవాలి. ఇతరుల వద్ద తమ డబ్బు ఉంటే తీసుకోవాలి. వ్యాపారులకు కొందరు శత్రువులు ఎదురవుతూ ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థుల కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా చూడాలి.
మీన రాశి వారికి ఫిబ్రవరి 27 నుంచి కొన్ని ఆశుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కొత్త పనులు అసలే ప్రారంభించవద్దు. డబ్బు సంపాదించడంలో తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు అధికారులతో వాగ్వాదాలు చేయడం మానుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య చికాకులు ఉండే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతోంది. వాహనాలపై ప్రయాణాలు చేయడం మానుకోవాలి. అత్యవసరమైతే ఇతరుల సహాయంతో ప్రయాణాలు చేయాలి. ఇతరులకు అప్పు ఇవ్వాల్సి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి