Bath Tips: భారతదేశంలో పురాణాలకు కొదవ లేదు. పురాతన కాలంలో హాయిగా జీవించడానికి పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరుచుకున్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి కొన్ని పద్ధతులు పెట్టి వాటిని పాటించాలని తరువాత తరాల వారికి చెప్పారు. అలా ఒకరి నుంచి మరొకరికి కొన్ని నియమాలు వస్తున్నాయి. వీటిని కొందరు పాటిస్తుండగా..మరికొందరికి అవగాహన లేకపోవడంతో పట్టించుకోవడం లేదు. అయితే ఆరోగ్యకరమైన జీవనం కొనసాగాలంటే ఇటువంటివి తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనది స్నానం చేయడం. స్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేస్తే మంచిది? అనే విషయాల్లోకి వెళితే..
పురాణాల ప్రకారం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం అంటారు. వీలైతే ఈ సమయంలో స్నానం చేయాలి. మగవారు లేదా ఆడవారు ఎవరైనా ఈ సమయంలో స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు. అలాగే మగవారు ప్రతిరోజూ తల స్నానం చేయడం చాలా మంచిది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు మాత్రం తప్పనిసరి కాదు.
స్నానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. ఎవరైనా నగ్నంగా స్నానం చేయకూడదు. శరీరంపై కనీసం ఒక వస్త్రం తప్పనిసరిగా ఉండాలి. టవల్ కట్టుకొని స్నానం చేయకూడదు. ఎందుకంటే మధ్యలో ఇది జారిపోతే అరిష్టం. అందువల్ల ఇతర మార్గాలు ఆలోచించాలి. అలాగే నిలబడి స్నానం చేయకూడదు. కూర్చొని స్నానం చేయాలి. అయితే నేటి కాలంలో అలాంటి సౌకర్యాలు లేనందున చాలా మంది నిలబడే స్నానం చేస్తున్నారు. బాత్ టబ్ లు ఉపయోగించేవారు మాత్రం వేరే రకంగా స్నానం చేస్తున్నారు.
ఆడవారు వారానికి ఒకసారి స్నానం చేసిన పర్వాలేదు. వారికి హెయిర్స్ ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రతిరోజూ తల స్నానం సాధ్యం కాదు. ఇక స్నానం చేసే నీటిలో అప్పుడప్పడు ఉప్పు వేసుకోవాలి. దీని వల్ల శరీరంపై ఉండే క్రిములు తొలిగిపోతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ దేవి ఇంట సందడి చేస్తుందని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.