Bangles women health benefits: మహిళలు అందంగా కనిపించేందుకు రకరకాల ఆభరణాలు ధరిస్తారు. వీటిలో గాజులు ముఖ్యమైనవి. కొందరు మహిళల చేతికి ఎప్పటికీ నిండుగా గాజులు ఉంటాయి. మరికొందరు మాత్రం గాజులు వేసుకోవడానికి అసలు ఇష్టపడరు. ఒకవేళ వేసుకున్న ఒక్కో గాజు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇలా ఒక్కో గాజు కాకుండా నిండుగా గాజులు ధరిస్తే ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు గాజులు ధరించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే మహిళలు గాజులు ఎందుకు ధరించాలి? ధరించకపోతే ఎలాంటి అశుభాలు జరుగుతాయి? ఆ వివరాల్లోకి వెళితే..
గాజులను లక్ష్మీదేవి గా భావిస్తారు. రెండుగా గాజులు ధరించిన వారిని దేవతతో పోలుస్తారు. అందుకే కొన్ని పూజ సమయంలో గాజులను కూడా ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. గాజులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా గ్రహాలు అనుకూలంగా మారేందుకు కూడా ఉపయోగపడతాయని పండితులు చెబుతున్నారు. సంపదకు, సంతోషానికి మూలమైన శుక్రగ్రహం గాజులు ధరించిన వారికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. శుక్ర గ్రహం దోషం ఉన్నవారు గాజులు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. మహిళలు గాజులు ధరించడం వల్ల తమకు మాత్రమే కాకుండా భర్తకు కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. భర్త శ్రేయస్సు కోసం గాజులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటున్నారు. అలాగే ఎప్పటికీ చేతికి గాజులు ఉండడంవల్ల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు.
Also Read: Wedding tradition bride position: భర్తకు ఎడమవైపున భార్య ఎందుకు ఉండాలి?
గాజులు ధరించడం కేవలం అలంకరణ కోసమే మాత్రమే కాకుండా ఇవి ఆరోగ్య ప్రయోజనాలు అనేకంగా ఇస్తాయని చెబుతున్నారు. మనికట్టు పై చేతి నుంచి గాజులు ధరించడం వల్ల రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీంతో గుండెకు రక్తప్రసరణ ఉండి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే గాజుల వల్ల చేతులు పై రాపిడి జరిగి నిత్యం చలనం ఉంటుంది. దీంతో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండగలుగుతారు. గాజుల చప్పుడుకు మెదడు చురుగ్గా మారుతుంది. గాజులతో పనిచేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.
గర్భిణీలు ఏడవ నెల దాటిన తర్వాత గాజులు తప్పనిసరిగా ధరించాలని కొందరు పెద్దవారు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల ఉంటుంది. గాజులు చేతికి ధరించడం వల్ల ఆ బిడ్డ మెదడు చురుగ్గా మారుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే సీమంతం అనే కార్యక్రమం నిర్వహించి చేతికి నిండుగా గాజులను ధరిస్తారు. అయితే కొందరు ఈ గాజులను పక్కన వస్తారు. అలా కాకుండా గాజులను చేతికి మాత్రమే ఉంచాలని చెబుతున్నారు.
Also Read: Weight loss Medicine: భారతదేశానికి వచ్చిన బరువు తగ్గించే మెడిసిన్.. ధర ఎంత? ఎక్కడ లభిస్తాయి?
పెళ్లయిన వారు తప్పనిసరిగా గాజులు ధరించాలి. లేకపోతే వారి తర్వాత వారికి గాజుల గురించి తెలిసే అవకాశం ఉండదు. రాజుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నేటి కాలం వారికి చెబుతూ ఉండాలి. ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ కారణంగా కొందరు గాజులు ధరించడం లేదు. అంతేకాకుండా ప్లాస్టిక్ గాజులు ఎక్కువగా ధరిస్తున్నారు. అలాకాకుండా మట్టి గాజులు మాత్రమే ధరించాలని చెప్పాలి.