Extra Marital Affair: పెళ్లినాటి ప్రమాణాల్లో నాతి చరామి అని చెప్పి ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తున్నారు. కడదాకా తోడుంటానని చేసిన బాసలు మరుస్తున్నారు. అక్రమ సంబంధాల వలలో పడుతున్నారు. కట్టుకున్న భార్య, భర్త అయినా ఇతరుల మోజులో పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పరాయి మహిళ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలు సైతం పోతున్నా పట్టించుకోవడం లేదు. తమకు ఆమెతోనే బాగుందని భావించి పక్కదారి పడుతున్నారు.

పశ్చిమబెంగాల్ లో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలో నర్సీబాబీబీ అనే మహిళ తన కూతురును మోఫిజుల్ మోండల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అత్త అల్లుడు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మామ లేనప్పుడు వచ్చి అత్తతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం బంధువులకు, గ్రామస్తులకు తెలిసింది. వారు కూడా ఓసారి హెచ్చరించారు. మీ మామ లేనప్పుడు ఇంటికి ఎందుకు వస్తున్నావని నిలదీసినా వారి బుద్ధి మారలేదు.
ఈ నేపథ్యంలో అల్లుడు మరోమారు మామ లేని సమయంలో మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు కర్రలు, బ్యాట్లతో ఇంటిని చుట్టుముట్టారు. ఇద్దరిని చితకబాదారు. అత్త ఆస్పత్రికి చేరే లోపే మరణించింది. అల్లుడు మాత్రం కొన ఊపిరితో పోరాడుతున్నాడు. వివాహేతర సంబంధం ఎంతకు దారి తీసిందో తెలిసిందా. అక్రమ సంబంధాల సంబరంలో చాలా మంది తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. హత్యల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి. అయినా మార్పు రావడం లేదు.
నాతి చరామికి టాటా చెప్పి పరాయి కాంతకు దాసోహం అంటున్నారు. క్షణిక సుఖం కోసం నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఇక్కడ అత్త ప్రాణాలే పోయాయి. అల్లుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయకపోవడం గమనార్హం. అక్రమ సంబంధాల వలలో పడి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దు. జీవిత భాగస్వామినే నమ్ముకుని హాయిగా జీవించండి. ఎలాంటి బాధలు ఉండవు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఎలాంటి కలతలు రాకుండా ఉండాలంటే వివాహేతర సంబంధాలు వద్దు అని గుర్తించండి.