Buying Own House: జీవితంలో ఎంత సంపాదించినా.. సొంతిల్లు కట్టుకోవడం పెద్ద కల. ఇది ఆర్థికంగా ఉన్నవారికి పెద్ద విషయమేమీ కాదు.. కానీ చిరుద్యోగులకు పెద్ద బాధ్యత. తమ జీవిత లక్ష్యాల్లో సొంతిల్లు కూడా చేరుతుంది. జీవితాన్న పణంగా పెట్టి మరీ సొంత గూడను నిర్మించుకుంటారు. అయితే చాలా మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే ఇల్లు కొనుగోలు చేయడానికి రెడీ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే పర్వాలేదు.. గానీ ప్రైవేట్ జాబ్స్ చేసేవారు ఇల్లు కొనుగోలు విషయంలో వెనకా ముందు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు సరైన ప్రణాళిక లేకుండా ఇల్లు కొనుగోలు చేస్తే ఆర్థిక చిక్కుల్లో పడుతారని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఏ వయసులో ఇల్లు కొనుగోలు చేయాలి? ఎప్పుడు సొంతం చేసుకోవాలి? అనేది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలపోతోంది.
కొందరు ఆర్థిక నిపుణులు ఇస్తున్న సూచనల ప్రకారం.. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఉద్యోగం పొందినట్లయితే వారితో ఉత్సాహ అపరిమితంగా ఉంటుంది. ఈ వయసులో ఉన్నవారికి చేతినిండి డబ్బు కనపించేసరికి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలని చూస్తారు. ఇదే సమయంలో ధర ఎక్కువైనా ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే వారికి వచ్చే ఆదాయం కన్నా ఇల్లు కొనుగోలు ఖరీదు మించితే మాత్రం చిక్కులో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
30ఏళ్లలోపు వారికి ఉద్యోగం ఉంటే బాధ్యతలు తక్కువే ఉంటాయి. ఒకవేళ ఈ వయసులో పెళ్లి చేసుకున్నా తక్కువ ఖర్చులే ఉంటాయి. అయితే ఈ సమయంలో వీరికి ఆదాయం బాగుంటే ఈఎంఐ ఎక్కువ ప్లాన్ చేసుకొని తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఇల్లు కొనుగోలు చేయొచ్చు. ఇలా దాదాపు 40 ఏళ్ల లోపు వచ్చేలా ఈఎంఐ పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకపోవచ్చు.
అలా అని వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ఈఎంఐకే కేటాయించకుండా కొంత ఇల్లు అవసరాలకు సర్దుకోవాలి. ఇంటి అవసరాలతో పాటు మిగతా లక్ష్యాలను పూర్తి చేసుకోవడానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఇక ఫూచర్ అవసరాలకు డిపాజిట్లు, మ్యూచ్ వల్ ఫండ్స్ వంటి వాటిలోనూ పెట్టుబడి చేసేలా ప్లాన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు వచ్చే ఆదాయం అంతా ఇల్లు కోసమే పోతుందన్న బాధ కలుగదు.
ఇక ఈఎంఐ మూలంగా ఇంట్లో ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇంటి వ్యయాలకు అవసరం మేరకు తగిన నిధులు కేటాయించుకోవాలి. ఇలా బ్యాలెన్స్ డ్ గా ఆదాయాన్ని సమకూర్చడం వల్ల అటు ఇంటి రుణంతో పాటు అవసరాతు తీరుతూ ఉంటాయి. అయితే ఇదంతా 40 ఏళ్లలోపు వారికి సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ 40 ఏళ్లలోనే ఈఎంఐ కట్టాల్సి వస్తే చాల తక్కువ బడ్జెట్ తో లాంగ్ టర్మ్ పెట్టుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.