Astrology: జీవితంలో డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత కష్టపడినా అనుకున్న ధ నాన్ని పొందలేరు. అందుకు కారణం తన కు ఉన్న దురదృష్టమే అని చింతిస్తూ ఉంటారు. అయితే అలా చింతించే బదులు లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల సంపద తిరగకుండా ఉంటుంది. అయితే ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల కూడా ధనం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లోని వస్తువులు ఒక్కోసారి సక్రమంగా లేకపోయినా కొన్నింటిని మాత్రం కావలసిన చోట ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ ముఖ్యమైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
Also Read: ఒడిశాలో ‘హెరిటేజ్’పై తనిఖీలు, ఆంక్షలు.. నిజం ఎంత?
ప్రతి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. పసుపు ఒకవైపు ఆరోగ్యం కోసం వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. మరోవైపు పూజ గదిలో వాడుతూ ఉంటాం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపును ఒక ప్రదేశంలో ఉంచడం వల్ల డబ్బులు ఆకర్షిస్తుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఒక శుభ్రమైన వస్త్రంలో పసుపును కట్టి దానిని డబ్బు నిలువ చేసే ప్రదేశంలో ఉండడం వల్ల సంపదను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా సంపద తక్కువగా ఉన్నా.. ధనాన్ని ఆకర్షించాలని అనుకున్నా.. ఇలా చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు.
ఆవులో సకల కోటి దేవతలు ఉంటారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల నిత్యం గోపూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని అంటారు. అంతేకాకుండా గోవులకు ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు. అయితే ప్రస్తుత కాలంలో గోవులు ఇందుబాటులో లేకపోవచ్చు. అయితే ఇలాంటి సమయంలో గోవుల విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజ చేయడం వల్ల సంపాదన ఆకర్షిస్తుందని చెబుతున్నారు. దీంతో అనుకున్న ధనాన్ని పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గోవులను ఇలా పూజించడం వల్ల వ్యాపారాలు తమ వ్యాపార అభివృద్ధిని పెంచుకోవచ్చని వాక్య శాస్త్రం తెలుపుతుంది.
చందమామ అందరికీ అందమైన దేవుడిగా కనిపిస్తాడు. కొందరు చందమామకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. నెలలో 15 రోజులపాటు చల్లని వాతావరణం ఇచ్చే చందమామకు వెండి అంటే చాలా ఇష్టం. అందువల్ల ఇంట్లో వెండి వస్తువులను ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. వెండి వస్తువుల వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే నిత్యం శాంతి సామరస్యాలు ఉంటూ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఏదైనా ప్రయత్నం చేస్తే వెండి వస్తువుల వల్ల విజయవంతంగా సాధించగలుగుతారు.
ఇవే కాకుండా నిత్యం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండడంవల్ల ధనం ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైన వస్తువులను వాస్తు ప్రకారం గా ఉంచుకోవడం వల్ల కూడా సంపద పెరిగే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి సంపద పెరగడానికి తోడ్పడుతుంది.