Zodiac Signs: సాధారణంగా గ్రహాల సంసారం ఆరు నెలల పాటు ఒక రాశిలో ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు సంవత్సరాల కాలం పాటు సంచరిస్తూ ఉంటాది. వీటిలో బృహస్పతి ఒకటి. తెలివితేటలు, అదృష్టాన్ని కలిగించే బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు మిగతా రాశులపై ప్రభావం పడుతుంది. అయితే గృహస్పతి ఒక రాశిలో సంవత్సర కాలం పాటు ఉంటుంది. అలా 12 రాశుల తిరిగేసరికి మళ్ళీ ఆ రాశిలోకి రావడానికి 12 ఏళ్లు పడుతుందన్నమాట. అలా 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. మే 14న మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన విజయాలు ఉండనున్నాయి. ఇలాంటి పరిస్థితి మళ్లీ 12 ఏళ్ల తర్వాతే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిధున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల ఎలాంటి రాశులకు ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
Also Read: అమరావతిలో ‘రియల్’భూమ్ .. తగ్గిందా? పెరిగిందా?
మిథున రాశిలోకి బృహస్పతి వెళ్లడం ద్వారా కన్యారాశి కర్మ స్థానంలో ప్రభావం ఉంటుంది. దీంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలను వీరు తొలగించుకోనున్నారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టనున్నారు. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం వీరి వెంటే ఉండడం వల్ల ఉద్యోగులు సైతం తాము అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించడం వల్ల తులా రాశి వారికి కలిసి వస్తుంది. మీరు ఏ పని అనుకుంటే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణం కోసం చేసే ఖర్చులు పలిస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే అవి లాభాన్ని తీసుకొస్తాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. పెద్దల సలహా ఉండడంతో పెట్టుబడులు నుంచి లాభాలు వస్తాయి.
బృహస్పతి రాసి మారడం వల్ల మీన రాశి వారికి అధిక ప్రయోజనాలు ఉండనున్నాయి. వీరికి పూర్వికుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. ఎన్నడూ లేనంత ధనాన్ని చూడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.
పై మూడు రాశులే కాకుండా మిగతా రాశుల వారిపై గృహస్పతి గ్రహం ప్రభావం పడనుంది. అయితే మిగతా రాశిల వారికి స్వల్పంగా ప్రయోజనాలు ఉన్న పై మూడు రాశుల వారికి మాత్రం పట్టలేని అదృష్టం ఉంది. అయితే ఈ మూడు రాశుల వారికి బృహస్పతి సంచారం వల్ల మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ బృహస్పతి మిధున రాశిలో సంచరించినంత కాలం ఈ మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. మీరు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే వెంటనే దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.