Womens Asia Cup 2022 India vs Sri Lanka: ఆసియా కప్ 2022 మహిళల ఆటలో ఫైనల్ లో లంకను చిత్తు చేసి భారత్ మరోసారి కప్ కైవసం చేసుకుంది. రోహిత్ సేన చేయలేని పనిని మహిళలు చేయడం విశేషం. లంకను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి తమ సత్తా చాటారు. 65 పరుగులకే లంకను కట్టడి చేసి 66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే చేదించి తమకెదురు లేదని నిరూపించారు. భారత బౌలర్ల ధాటికి లంక కుదేలైపోయింది. భారత్ ఖాతాలో మరో కప్ చేరింది. 8 ఎడిషన్లలో ఏడుసార్లు భారత మహిళలు విజేతలుగా నిలవడం గమనార్హం.

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో మహిళలు తమ సంత్తా చాటారు. 66 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేదించారు. పెపాలీ వర్మ 5 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 2 వికెట్లను త్వరగా కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో ఆడారు. స్మృతి మందాన 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేయడం విశేషం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 14 బంతుల్లో 11 పరుగులు చేయడంతో విజయం సాధ్యమైంది. రోహిత్ చేసిన తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా ఆడి మనకు కప్ సాధించడంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.
టాస్ గెలిచిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. తొమ్మిది వికెట్లు కోల్పోయారు. దీంతో ఇండియా ఎక్కడ కూడా తడబాటుకు గురవలేదు. లంక కెప్టెన్ చమరీ ఆటపట్టు 12 బంతుల్లో ఒక ఫోర్ తో 6 పరుగులు చేసి రనౌట్ కావడం సంచలనం కలిగించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో రనౌట్ అయిన మొదటి కెప్టెన్ గా ఆటపట్టు నిలవడం విశేషం. మహిళా కప్ ను సొంతం చేసుకున్న జట్టు రోహిత్ శర్మకు గుణపాఠం కానుంది. ఇంత జరుగుతున్నా రోహిత్ సేన ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఆడిందో అని పలువురు చర్చించుకుంటున్నారు.

రోహిత్ శర్మ చేయలేని పని ఆడాళ్ల జట్టు చేయడంతో ఇకనైనా వారికి కొంచెమైనా ఆటమీద శ్రద్ధ ఉంటుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆడాళ్లయి ఉండి వారు దేశ ప్రతిష్టను నిలబెడితే మీసాలు ఉన్న మగాళ్లు మాత్రం ఫైనల్ కు చేరలేకపోవడం అందరిని కలచివేసింది. ఇకనైనా రోహిత్ సేన బుద్ధి తెచ్చుకుని ఆటపై దృష్టి సారించి కప్ లు కైవసం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వారికి గౌరవం దక్కుతుంది. మేం ఆటగాళ్లం అంటే సరిపోదు. అందుకగుణంగా ఆట తీరు కూడా ఉండాల్సిందే.