https://oktelugu.com/

Magha Amavasya: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?

Magha Amavasya: ప్రతి నెల మనకు అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అంటారు. ఈ అమావాస్య నుంచి మాఘ మాసం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున శివ నామస్మరణతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు.అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘ అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ విధమైనటువంటి దానధర్మాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం… మేష రాశి: ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2022 / 02:49 PM IST

    Magha Amavasya

    Follow us on

    Magha Amavasya: ప్రతి నెల మనకు అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అంటారు. ఈ అమావాస్య నుంచి మాఘ మాసం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున శివ నామస్మరణతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు.అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘ అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ విధమైనటువంటి దానధర్మాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం…

    Magha Amavasya

    మేష రాశి: ఈ రాశికి చెందిన వారు మాఘ అమావాస్య రోజున నువ్వులు గోధుమలు దానం చేయడం ఎంతో శుభకరం.

    వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ అమావాస్య రోజున చెక్కెర, బార్లీ దానం చేయాలి.

    మిధున రాశి: మిధున రాశి వారు అమావాస్య రోజున పసుపు వస్త్రాలను దానం చేయటం వల్ల వీరికి డబ్బుకు తిండికి లోటు ఉండదు.

    కర్కాటకం: కర్కాటక రాశి వారు బియ్యం, పాలు పెరుగు వంటి తెలుపు వస్తువులను దానం చేయాలి.

    సింహరాశి: ఈ అమావాస్య రోజు సింహ రాశి వారు నిద్రలేచి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.

    కన్య రాశి: కన్య రాశివారు మాఘ అమావాస్య రోజున పశువులకు పచ్చిగడ్డి తినిపించాలి. పప్పులు తిలకం వంటి వస్తువులను దానం చేయాలి.

    తుల: తులా రాశి వారు మాఘ అమావాస్య రోజున తియ్యని పదార్థాలను దానం చేయడం ఎంతో శుభకరం.

    వృశ్చికం: వృశ్చిక రాశి వారు మాఘ అమావాస్య రోజున రాగి వస్తువులను దానం చేయడం మంచిది.

    ధనస్సు: మాఘ అమావాస్య రోజున ధనస్సు రాశి వారు పప్పులు బెల్లం తేనె వంటి వస్తువులను దానం చేయాలి.

    Also Read: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే జీవితమే మారిపోతుంది!

    మకర రాశి: మకర రాశి వారు ఈ అమావాస్య రోజున నలుపు వస్త్రాలను దానం చేయడం వల్ల దన సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి.

    కుంభం: కుంభ రాశి వారు ఇనుప వస్తువులు, నువ్వులు, ఆవనూనె, దానం చేయడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి.

    మీనం: మీన రాశి వారు పసుపు, చందనం, పప్పులు, దుప్పట్లు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

    Also Read: కలబందను ఎక్కువగా వాడుతున్నారా.. ప్రమాదకరమైన సమస్యలు వచ్చే ఛాన్స్!