smart watch : ప్రస్తుతం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని అంతకు మించి ఖర్చు పెట్టి పది మందికి చూపించడం కూడా అంతే ముఖ్యం అనేట్టుగా తయారు అవుతున్నారు చాలా మంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఖరీదైన బట్టలు, ఆర్నమెంట్స్, చెప్పులు, షూలు, రింగులు, వాచ్ లు వంటివి ధరిస్తున్నారు. సరే ఇష్టానికి ధరించడం వేరు. వేలు, లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫ్యాషన్ ఫాలో అవడం వేరు కదా. మరీ ముఖ్యం డబ్బులు లేకపోతే పక్క వారి వద్ద అప్పు చేసి మరీ కొనుగోలు చేయడం చూస్తుంటే కొందరు ఆందోళన చెందుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఇంతకీ మీకు వాచ్ లు అంటే ఇష్టమా? ఖరీదైనది అయినా నార్మల్ వాచ్ అయినా సరే పెట్టుకోవడం మీకు అలవాటా? ఇక అందులో మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లు పెట్టుకుంటున్నారా? ఈ మధ్యలో స్మార్ట్ వాచ్ లు ఎక్కువగా రాజ్యమేలుతున్నాయి. ఇంతకీ వీటి వల్ల ఎలాంటి నష్టం లేదు అంటారా? ఈ ఆర్టికల్ లో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వాచ్‌లు అందరూ ధరించడం కామన్. వాచ్‌లు ధరించడం వల్ల ఎంతో హుందాగా కనిపిస్తారు. అందుకే చాలా మంది ధరిస్తారు కూడా. ఇక కాలానుగుణంగా వాచ్‌లలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటి కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొంటున్నారు. చూసేందుకు కూడా స్టైల్‌గానే కనిపిస్తాయి. ఇక ఒక్క స్మార్ట్ వాచ్ ధరిస్తే చాలు.. ఎన్నో విషయాలు తెలియడం కూడా కామనే. అయితే స్మార్ట్ వాచ్‌లు ధరించే వారికి ఓ షాకింగ్ న్యూస్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్మార్ట్ వాచ్‌లు ధరించడం వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే ఈ వాచ్ ల ను తయారు చేయడానికి ఉపయోగించే పర్‌ప్లోరో హెక్సనోయిక్ యాసిడ్స్ , పాటీ ఫ్లోరో అల్కైల్ శరీరంపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తున్నాయట.
ఈ రసాయనాలు శరీరంలో సులభంగా కలవవు. అందుకే సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్, చర్మ సమస్యలు వంటి వివిధ రకాల వ్యాదులు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాదు చర్మ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇక దాదాపు 22 రకాల స్మార్ట్ వాచ్ బాండ్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చారు. రోజులో ఎక్కువ సేపు స్మార్ట్ వాచ్ ధరించే వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.