interview : ఉద్యోగాలు చేయాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది. దాని కోసం ఎంతో కష్టపడతారు. డబ్బులు సంపాదించాలి కాబట్టి ఒక మంచి ఉద్యోగం అవసరం. పేరు, ప్రతిష్టలు రావాలన్నా సరే ఒక మంచి ఉద్యోగం చేతిలో ఉండాల్సిందే. ఉద్యోగం వస్తే ప్రాబ్లం లేదు కానీ ఉద్యోగం వచ్చే వరకు పడే కష్టం మాత్రం చాలా బాధగా ఉంటుంది. కొందరికి త్వరగానే లభిస్తుంది కానీ కొందరికి చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. అయితే ఉద్యోగంలో పరీక్షలు ఎంత ముఖ్యమో ఇంటర్వ్యూ అంతే ముఖ్యం. మీరు కూడా ఇంటర్వ్యూలో ఇబ్బంది పడ్డారా? అయితే ఇంటర్వ్యూ సక్సెస్ కావడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఏం చేయాలి అంటే?
మీ మీద ఇంటర్వ్యూ చేసే వారు సానుకూల ముద్ర వేయాలి అంటే మీ విజయావకాశాలను పెంచుకోవడానికి ఇంటర్వ్యూలో నమ్మకంగా కనిపించడం చాలా అవసరం. తగిన దుస్తులు ధరించడం, కంపెనీ దుస్తుల కోడ్‌ను పరిశోధించడం, చక్కగా మంచి దుస్తుల వల్ల మీ వ్యక్తిత్వాన్ని కూడా వారు అంచనా వేస్తారు అని గుర్తు ఉంచుకోండి. బట్టలే కదా అని ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా మీరు ఎంచుకునే జాబ్ ను బట్ట దానికి సంబంధించిన దుస్తులు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు రెడీ అవండి. ఇక చాలా కంపెనీల్లో ఫార్మల్ వియర్ మస్ట్. అలాంటి వారు మాత్రం ఈ కోడ్ ను మాత్రం మర్చిపోవద్దు.
నిటారుగా కూర్చుని, కాన్పిడెంట్ గా ఉండాలి. ఓపెన్‌గా కనిపించేలా మీ చేతులను విప్పి ఉంచడం మంచి స్టైల్ అని గుర్తుంచుకోండి. మీరు శ్రద్ధగా, ఆసక్తిగా ఉన్నారని చూపించడానికి సహజంగా ఐ కాంటాక్ట్ ఇవ్వండి. ప్రశాంతత, ఏకాగ్రతతో ఉండటానికి శ్వాస పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. ఇది భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మాట్లాడేది మనషులతోనే అని గుర్తు పెట్టుకోండి. ఎందుకు తెగ భయపడతారు. మిమ్మల్ని కొట్టరు, తిట్టరు అని కూడా గుర్తు పెట్టుకోండి. భయంతో కాకుండా ఫ్రీగా వెళ్లండి.
మీ విశ్వాసాన్ని పెంచడానికి సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలకు మీ సమాధానాలను సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు. అవసరం అయితే రిహార్సల్ చేయండి. ఇక నిదానంగా, ఆలోచనాత్మకంగా మాట్లాడండి. స్పష్టంగా, సంక్షిప్తంగా ప్రతిస్పందించడానికి మీ సమయాన్ని కాస్త స్పెంట్ చేయండి. స్పీడ్ స్పీడ్ గా మాట్లాడవద్దు. ఆసక్తి, చొరవ చూపడానికి పాత్ర లేదా కంపెనీ గురించి ప్రశ్నలు అడగండి. మీ బలాలపై దృష్టి పెట్టండి. మీరు దరఖాస్తు చేస్తున్న స్థానానికి అవి ఎలా సరిపోతాయో హైలైట్ చేయండి. మీ చేతులను స్థిరంగా, రిలాక్స్‌గా ఉంచడం ద్వారా మీ ఆసక్తివ చూపించాలి. ఎక్కువగా కదలడం మంచిది కాదు.